విరేచనాలు తగ్గటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు       2018-05-10   22:44:47  IST  Lakshmi P

వేసవికాలం వచ్చిందంటే రకరకాల సమస్యలు వస్తు ఉంటాయి. వాటిలో డయేరియా ఒకటి. తరచుగా నీళ్ళ విరేచనాలు అవ్వటం,కడుపునొప్పి,డి హైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే విరేచనాల సమస్య నుండి చాలా తేలికగా బయట పడవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ పసుపు వేసి త్రాగాలి. పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విరేచనాలకు కారణం అయినా బ్యాక్టీరియాను తరిమికొట్టటంలో బాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. రోజులో రెండు నుంచి మూడు సార్లు త్రాగాలి.

ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో పావు స్పూన్ అల్లం పేస్ట్ కలిపి ఉదయం,సాయంత్రం రెండు సార్లు త్రాగితే డయేరియా సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

ఒక కప్పు నీటిలో దాల్చినచెక్క,అల్లం వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిలో తేనే కలుపుకొని త్రాగితే సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.

అల్లం పేస్ట్ లో నిమ్మరసం కలిపి ఉదయం,సాయంత్రం తీసుకుంటే చాలా త్వరగా డయేరియా సమస్య నుండి బయట పడవచ్చు.