ఏపీలో ఇప్పట్లో కొత్త కొలువులు లేనట్లే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు.ఇక ఆ తర్వాత రాష్ట్రంలో ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.

 Looks Like There Are No New Scales In The Ap Right Now-TeluguStop.com

దీంతో భవిష్యత్తులోనైనా ఇతరత్రా విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారేమోనని ఎంతో ఆశతో నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.కానీ తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం జగన్ సర్కారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఈ స్టాఫ్ రివ్యూ సెల్ లో సిబ్బందిని నియమించాలని కోరుతూ శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

 Looks Like There Are No New Scales In The Ap Right Now-ఏపీలో ఇప్పట్లో కొత్త కొలువులు లేనట్లే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సిబ్బంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? ఉన్నవారిలో ఎంతమంది ఉద్యోగులు అవసరం? అవసరానికి మించి అదనంగా ఉన్న ఉద్యోగులను వేరే ఎక్కడైనా సర్దుబాటు చేయొచ్చా? ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కువ పని ఉంది? ఏ డిపార్ట్మెంట్ లో తక్కువ పని ఉంది? వంటి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఒక డీటెయిల్డ్ రిపోర్టు సమర్పించడానికి రెడీ అయిపోయారు.

Telugu Ap Cm, Ap Politics, Jagan, Job, Notification, Salaries-Latest News - Telugu

అయితే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల గురించి సమాచారాన్ని సేకరించినంత మాత్రాన భవిష్యత్తులో జాబ్ నోటిఫికేషన్స్ రాకుండాపోతాయా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.రాష్ట్ర విభజన జరగక ముందుకు అనగా 1990లో గవర్నమెంట్ కార్యాలయాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఆఫీసుల్లో ఇంత మంది ఉద్యోగులు అవసరమా? అనే ప్రశ్న తలెత్తింది.అయితే అప్పట్లో గిర్‌గ్లానీయే అనే ఓ అధికారి అన్ని శాఖల నుంచి ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు.

ఆ నివేదికలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం పొందుపరిచారు.

అయితే ఈ నివేదికను పరిశీలించిన తర్వాత 1 లక్షా 35 వేల మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని తేలింది.అదనంగా ఉన్న ఉద్యోగులందరినీ కొలువు నుంచి తీసేస్తారని అప్పట్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

కానీ ప్రభుత్వం అలా చేయలేదు.కానీ రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తగా భర్తీలు ఏమి చేయలేదు.

ఉద్యోగ నియామకాలు పూర్తిగా నిలిపివేశారు.అయితే ఇదే తరహాలో ప్రస్తుతం కూడా కొత్త నియామకాలకు చెక్ పెట్టే దిశగా సర్కారు నిర్ణయం తీసుకుందని స్పష్టమవుతోంది.

#AP Politics #Notification #Jagan #AP Cm #Salaries

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు