సీరియల్‌లో అమాయకంగా కనిపిస్తుంది కానీ.. రియల్ లైఫ్‌లో ఈ టీవీ నటికీ చాలా పొగరట?

సాధారణంగా ఎంతోమంది నటీనటులు వెండితెరపై సందడి చేయాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఏ విధమైనటువంటి అవకాశాలు రాని పక్షంలో బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతారు.

 Looks Innocent In The Serial But Is This Tv Actress Too Angry And Arrogant In Real Life-TeluguStop.com

ఇలా బుల్లితెరపై ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు తమదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత వెండి తెరపై అవకాశాలను అందిపుచ్చుకుని వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇలా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ ఆర్టిస్ట్ లహరి (ఇంటింటి గృహలక్ష్మి శృతి) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఈ నటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

 Looks Innocent In The Serial But Is This Tv Actress Too Angry And Arrogant In Real Life-సీరియల్‌లో అమాయకంగా కనిపిస్తుంది కానీ.. రియల్ లైఫ్‌లో ఈ టీవీ నటికీ చాలా పొగరట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు 20 సీరియల్స్ కి పైగా చేసిన ఈమె ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమే.తెరపై ఎంతో అమాయకంగా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకునే లహరి నిజ జీవితంలో మాత్రం తను అమాయకురాలు కాదు ఎంతో పొగరుగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న లహరి యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో పొగరుగా సమాధానాలు చెప్పడం చేత చాలా మంది అభిమానులు ఈమె సీరియల్స్ లో కనిపించే అంత అమాయకురాలు కాదని, ఈమెకు చాలా పొగరు అంటూ కామెంట్ చేస్తుంటారు.ఇలా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇప్పటి వరకు నటించిన సీరియల్స్ లో తనకు ఇష్టమైన పాత్ర ఏది అని అడగగా అన్ని ఇష్టమైనవి కాబట్టి అందులో నటించాననే సమాధానం చెప్పారు.అయితే ఇప్పటివరకు మీ లైఫ్ లో ఏ విధమైనటువంటి బాడ్ ఎక్స్పీరియన్స్ లేదా అని అడగగా తన జీవితంలో ఎలాంటి బాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇతర నటీనటులతో కానీ తనకు ఏ విధమైనటువంటి గొడవలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే ప్రస్తుతం తాను నటిస్తున్న గృహలక్ష్మి సీరియల్ గురించి మాట్లాడుతూ ఈ సీరియల్లో మీరు ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు ఫ్యూచర్ లో మీ పాత్ర మారనుందా అన్న ప్రశ్న ఎదురుకాగా అందుకు ఆమె సమాధానం చెబుతూ నాకు కూడా తెలియదు మా సీరియల్ ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో రచయితల చేతిలో కూడా ఉండదని తెలిపారు.

Telugu Angry, Innocent, Intinti Gruhalakshmi, Lahari, Serial-Movie

సీరియల్ చూసే దాన్ని బట్టి కథ మారుతుందని, సీరియల్ కు వచ్చే రేటింగ్ బట్టి సీరియల్ ఎంత కాలం కొనసాగగలదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కథను మార్పులు చేస్తుంటారని ఈ సందర్భంగా లహరి తెలియజేశారు.ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే అన్ని టీవీ ఛానళ్లలో పలు సినిమాలలో నటించడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.పలు షూటింగులతో బిజీగా ఉండడమే కాకుండా యూట్యూబ్ ఛానల్, పలు ఈవెంట్స్ లో సందడి చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన సమాధానాలు బాగా ఉన్నప్పటికీ, ఆ సమాధానాలు చెప్పిన విధానం బాగాలేదని సమాధానాలను ఎంతో పొగరుగా చెప్పడంతో ఈమెపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.తెరపై అమాయకంగా కనిపించిన ఈమె మహా ఘటికురాలు, ఈమెకు పొగరు కూడా ఎక్కువ అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.

#Angry #Lahari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు