ఎన్టీఆర్, రామ్ చరణ్ కంటే ముందు ఆర్ఆర్ఆర్ కోసం ఈ కాంబినేషన్లు చూశారట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మల్టీస్టారర్ గా, పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్సి నిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకొని ఉంటారు.

 Looking For These Combinations- For Rrr Than Ntr Ram Charan Rrr, Ntr Ram Chran,-TeluguStop.com

ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు.

నిజానికి రాజమౌళి ఈ సినిమాలో చేయడం కోసం ముందుగా అనుకున్నది ఎన్టీఆర్, రామ్ చరణ్ కాదు అనే విషయాన్ని కథకుడు విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అసలు ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎలా పుట్టింది అనే విషయాన్ని కూడా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

Telugu Allu Arju, Karthi Surya, Ntr Ram Chran, Rajamouli, Rajani Kanth-Movie

మొదటగా ఈ చిత్రంలో చేయడానికి తారక్, చెర్రీ బదులుగా రజనీకాంత్ -ఎన్టీఆర్, కార్తీ -సూర్య, అల్లు అర్జున్ -ఎన్టీఆర్, కార్తీ -అల్లు అర్జున్ వంటి కాంబినేషన్లో సినిమా తెరకెక్కించాలని ఆలోచన చేశారు.చివరకు ఈ సినిమాలో తారక -చరణ్ ఫైనల్ అయ్యారని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Telugu Allu Arju, Karthi Surya, Ntr Ram Chran, Rajamouli, Rajani Kanth-Movie

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడిగా మారడానికి రెండు సంవత్సరాల ముందు ఎవరికీ కనిపించకుండా వెళ్లారు.ఆ తరువాత అతను పోరాటయోధుడుగా మారి ఆంగ్లేయులతో పోరాటం చేశారు.అలాగే కొంత కాలం పాటు కొమరం భీమ్ కూడా కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు.

ఇలా వీరిద్దరూ కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు? వీరు కనిపించని సమయంలో ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ద్వారా ఈ సినిమా తెరకెక్కిందని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube