మంగళవారం ఆంజనేయ స్వామి, శ్రీమహాలక్ష్మిని పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.అందువల్ల మంగళవారం అమ్మవారికి విశేష పూజలు చేస్తుంటారు.
అయితే మంగళవారం ఉదయం నిద్రలేచి కుబేర స్థానాన్ని చూడటం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పండితులు తెలియ జేస్తున్నారు.
కుబేరుడు ధనానికి అధిపతి అని భావిస్తారు.
కుబేరుడిని మన ఇంటికి ఉత్తర దిక్కున కుబేరుడు స్థానంగా పరిగణిస్తారు.అందువల్ల ఆ దిశలో కుబేరుని విగ్రహాన్ని పెట్టి పూజించడం ద్వారా ధన ప్రాప్తి కలుగు తుందని విశ్వసిస్తారు.
వ్యాపారాలు చేసే వారు ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం ఉంచడం ద్వారా వ్యాపార అభివృద్ధి జరుగు తుందని ప్రజలు విశ్వసిస్తుంటారు.అలాగే మంగళవారం ఆంజనేయునికి పూజలు చేయటం ద్వారా మనం చేసేటటువంటి పనులను ఎటువంటి ఆటంకం లేకుండా ఎదుర్కోవడానికి, శక్తిని ప్రసాదిస్తాడు.
ప్రతి మంగళ, శుక్ర, శని, అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి రోజులు శ్రీమహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించటం ద్వారా, శుభ ఫలితాలు కలుగుతాయి.ఋణ బాధలు తొలగిపోయి, ఆర్థికంగా రాణించాలంటే శుక్ర మంగళవారాల్లో లక్ష్మీదేవిని నమస్కరించి.
శ్రీ సూక్తి ని మూడు సార్లు పఠించాలి.ఆరోజు ఉపవాస దీక్షలతో పూజ చేయడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి.
మంగళవారం ఉదయం నిద్ర లేవగానే కుబేరుని చూడటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి.రాత్రి పడుకునే సమయంలో దక్షిణ దిశగా తలపెట్టుకుని ఉదయం లేవగానే కుబేర స్థానాన్ని చూడాలి.
కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి, మనకు ధనాదాయం పెరుగుతుంది.దానికితోడు ఈ మంత్రాన్ని పట్టించాలి.
”చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్” ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవడం ద్వారా కోరిన కోర్కెలు తీరుతాయని, ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.