అరవైలో..ఇరవై అవ్వాలంటే ఇవే సూత్రాలు

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి…చాలా మంది వయసు మీదపడుతున్న కొద్దీ ఎదో కోల్పోయిన వారిలా.నిస్సహాయతతో ఉంటారు.

 How To Look Young,young, Skin, Youth, Romantic, Lifestyle-TeluguStop.com

ఎవ్వరితోను కలిసే ప్రయత్నం చేయరు.ఇటువంటి పరిస్థితుల్లోనే వయసు మళ్ళినప్పుడు వచ్చే రోగాలకంటే కూడా.

మానసిక రోగాలు ఎక్కువయ్యి కుంగిపోతారు.అసలు శారీరక రోగం కంటే కూడా మానసిక రోగం మనిషిని మరింతగా కుంగదీస్తుంది.

అటువంటి పరిస్తితులనుండి ఎలా బయటపడాలి అంటే.
వృద్దులు వయసు పైబడినది కదా అని ఒక గదికి పరిమితం కాకండి.

నిత్య యవ్వనులుగా ఉండాలి అంటే ఈ పద్దతులు పాటించండి.
వీలుచేసుకుని ఎక్కడికైనా ప్రయాణాలు చేయండి.

అవకాశం వచ్చినప్పుడల్లా సుదూర ప్రాంతాలకు వెళ్ళండి ఈ ఆలోచనా పద్దతి మీ మనసుని యవ్వనస్తులుగా ఉంచడానికి దోహద పడుతుంది.మీకు చాలా అనుభం ఉండవచ్చు అలాగని మీకు తెలిసిన విషయాలని యువకులకు చెప్తూ లెక్చర్లు అతిగా ఇవ్వకండి.

మీరు రెగ్యులర్ గా చేసే పనులని.మరొక విధంగా ఎలా చేయవచ్చో ఆలోచించండి.బట్టలు వేసుకునే పద్దతుల్లో కూడా చేంజ్ చేయండి.కొత్తగా కనపడటానికి ట్రై చేయండి.

వృద్ధాప్యం కదా రోమాన్స్ కి దూరం అని చాలా మంది భావన అది చాలా తప్పు.రోమాన్స్ కి నిభందన ఏమీ లేదు.మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో అంత యవ్వనంగా ఉన్నట్టే.యువకులతో కలిసి సరదాగా గడపండి.

వారితో కలిసి ఆడండి ,పాడండి.సరదాగా కబుర్లు చెప్పి వారిని ఉచ్చాహ పరచండి.

తద్వారా మీరు మరింత ఆనందంగా ఉంటారు.అరవైలో ఇరవై లా మారిపోతారు.

ముసలితనం శరీరానికి కానీ మనసుకి మాత్రం కాదు అనేది గుర్తించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube