పైకేమో ఐస్‌క్రీమ్‌.. లోప‌ల ఏం క‌లుపుతున్నారో తెలిస్తే..

ఐస్ క్రీమ్ అంటే చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వారి దాకా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ప్ర‌త్యేకించి చిన్న పిల్ల‌లు అయితే దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

 Look Like Ice Cream If You Know What Is Being Mixed Inside-TeluguStop.com

ఇలాంటి ఐస్‌క్రీమ్ ల‌వ‌ర్స్ కోసం కంపెనీలు కూడా ఎన్నో ర‌కాల ఐస్ క్రీమ్ ఫ్లేవ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి.ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌ను బేస్ చేసుకుని చాలా కంపెనీలో ఐస్‌క్రీమ్‌ల‌లో విప‌రీత‌మైన మార్పులు తీసుకొచ్చాయి.

వాటిని త‌యారు చేసే విధానం ద‌గ్గ‌రి నుంచి వాటిని అమ్మే విధానం దాకా అన్నింటిలోనూ మార్పులు చేస్తున్నాయి.

 Look Like Ice Cream If You Know What Is Being Mixed Inside-పైకేమో ఐస్‌క్రీమ్‌.. లోప‌ల ఏం క‌లుపుతున్నారో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఓ సంచ‌ల‌న వార్త ఐస్ క్రీమ్ ప్రియుల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

అదేంటంటే ఐస్ క్రీమ్ ల‌లో లిక్కర్ ఉండ‌టం సంచలనంగా మారింది.ఇది వినడానికే ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఓ చోట ఇలాగే ఐస్ క్రీమ్‌లో లిక్క‌ర్ క‌లిపి అమ్ముతున్న‌ట్టు బ‌య‌ట ప‌డ‌టం పెద్ద దుమార‌మే రేపుతోంది.

కోయంబ‌త్తూర్ లో ఈ విధ‌మైన మద్యం కలిపిన ఐస్ క‌నిపించింది.ఈ ముఠా కేవ‌లం యూత్‌ను టార్గెట్ గా చేసుకుని ఇలా కలిపిన మద్యం క‌లిపి ఐస్‌క్రీమ్ లను అమ్ముతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యం కాస్తా అక్క‌డి అధికారుల‌కు తెలియ‌డంతో వారు రంగంలోకి దిగారు.

Telugu Ice Cream, Liquir, Look Like Ice Cream If You Know What Is Being Mixed Inside-Latest News - Telugu

ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమానం వ‌చ్చిన ప్రాంతంలో సెర్చ్ చేయ‌గా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

కోయం బ‌త్తూర్లోని ఓ హోటల్ లో త‌నిఖీలు చేప‌ట్ట‌గా అందులో లిక్క‌ర్ క‌లిపిన ఐస్ క్రీమ్‌లు అమ్ముతున్న‌ట్టు తేలింది.ఇంకేముంది ఆ హోట‌ల్ ను అధికారులు సీజ్ చేశారంట‌.

అవినాశిపాలయంలో నెల‌కొల్పిన‌టువంటి రోలింగ్ డఫ్ కేఫ్‌లో ఈ విధంగా లిక్కర్‌ ఐస్‌క్రీమ్ లు సేల్ చేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు.ఈ విష‌యం తెలుసుకుని అందులో ఐస్ క్రీమ్‌లు తినేవారంతా షాక్ అయిపోతున్నారు.

#Liquir #Cream

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube