వంద చిత్రాలు దాటిన తెలుగు హీరోలు ఎవరెవరు?

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం ఖైదీనం 150 సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల సునామి సృష్టిస్తే, యువరత్న బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో ప్రేక్షకుల మన్ననలు పొందారు.ఇద్దరు అగ్రహీరోలు తమ మైలురాయి చిత్రాలతో అలరించడం ఆనందించదగ్గ విషయం.

 Look How Many Telugu Heroes Have Crossed 100 Films-TeluguStop.com

మరి వీరిద్దరు మాత్రమేనా, లేక శతచిత్రాల దాటిన కథానాయకులు ఇంకెవరున్నారో తెలుసా? తెలియకపోతే ఇటు చూడండి.

* బాలకృష్ణ, జగపతిబాబు ఇద్దరు వంద సినిమాల మైలురాయిని అందుకున్న సంగతి విదితమే.

* అందాల నటుడు శోభన్ బాబు 120 చిత్రాలు చేశారు.

* శ్రీకాంత్ 123 సినిమాలు పూర్తి చేశారు.

* మెగాస్టార్ చిరంజీవి కౌంట్ 150 సినిమాలు.

* రెబల్ స్టార్ కృష్ణంరాజు 190 సినిమాలు చేయగా, నటికిరీటి రాజేంద్రప్రసాద్ దాదాపుగా రెండునూరుల సినిమాలు చేసారు.

* స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 254 సినిమాల్లో అభినయించారు.

* విశ్వవిఖ్యాత నటసౌర్వభోమ ఎన్టీఆర్ (సీనియర్) 303 సినిమాల్లో మనల్ని అలరించారు.

* డేరింగ్ ఆండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ్ 350 సినిమాలకు చేరువలో ఉన్నారు.

* హీరోగా, విలన్ గా, కామెడియన్ గా, అన్నిరకాల పాత్రల్లో అభినయించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏకంగా 560కి పైగా చిత్రాల్లో కనిపించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube