ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది   Long Work Hours Will Increase The Risk Of Cancer In Women     2016-06-17   05:32:06  IST  Lakshmi P

ఇంట్లో సమస్యలు, పనుల గురించి పురుషుల కంటే ఎక్కువ పట్టించుకుంటారు మహిళలు. అందువలన మానసిక ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. ఇక ఉద్యోగం చేసే మహిళలకైతే ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఇటు ఇల్లు చూసుకోవాలి, అటు ఆఫీసు పని చూసుకోవాలి, ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఇంటిపని చూసుకోవాలి అంటే, పెద్ద భారమే తలమీద పడుపోతుంది. అలాంటి మహిళలకి క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువంట.

ది ఓహియో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ చేసిన ఓ రీసెర్చిలో ఈ విషయం బయటపడింది. వారానికి 40, అంతకంటే ఎక్కువ పనిగంటలు ఉండి, అలాగే ఓ మూడు దశాబ్దాల పాటు పనిచేస్తే, ఈ ప్రపంచం నుంచి త్వరగా వెళ్ళిపోతారట మహిళలు.

అయితే అబ్బాయిలకు, అమ్మాయిలకు ఉన్నంత ప్రమాదం లేదంట. ఆఫీసు దాటితే, పని ఒత్తిడి మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం వలన, పురుషులకి ఇది పెద్ద సమస్య కాదు. అందుకే వయసులో ఉన్నాం కదా అని పగలంతా అఫీసులో పనిచేసి, మళ్ళీ ఇంటిపనులు కూడా చూసుకునే అమ్మాయిలు ఇకనుంచైనా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.