ఒక కోడి గుడ్డు రూ. 1000.. ఇక కోడి పుంజు రేటు వింటే గుండె పట్టుకోవాల్సిందే

సాదారణంగా ఒక కోడి గుడ్డు ధర అయిదు రూపాయల లోపే ఉంటుంది.నాటు కోడి గుడ్డు అయితే కాస్త అటు ఇటు ఉండే అవకాశం ఉంటుంది.

 Long Tail Cocks Parla Breed-TeluguStop.com

కాని ఈ కోళ్లు పెట్టే గుడ్ల ధర మాత్రం వెయ్యి రూపాయలకు అటు ఇటుగా ఉంటుంది.ఆ గుడ్డు వండుకుని తినడానికి కాదు, వెయ్యి రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆ గుడ్డును ఎవరు కూడా వండుకుని తినరు.

దాన్ని పొదుగు వేసి దాని నుండి పిల్లను తీస్తారు.అంటే గుడ్డుకు వెయ్యి రూపాయలు కాదు, ఆ గుడ్డులో ఉన్న కోడి పిల్లకు వెయ్యి రూపాయలు అన్నమాట.

అంత ఖరీదైన ఆ కోడి పిల్ల ఏంటా అని ఆలోచిస్తున్నారా… పిల్లకే వెయ్యి రూపాయలు అయితే ఆ గుడ్డును పెట్టే కోడికి ఎంత రేటు ఉండొచ్చు ఊహించండి.ఆగండి మీరు ఊహించడం కష్టమే కాని నేనే చెప్తాను, ఆ కోడి ధర 1.5 లక్షల నుండి 1.75 లక్షల వరకు ఉంటుంది.

కోడికి అంత ధర ఏంటీ, అదేమైన ఔషద గుణం ఉన్న కోడినా అనుకుంటున్నారా, అయ్యో అసలు దాన్ని మాసం తినరు, మరి ముఖ్యంగా దాన్ని పందెం కోసం కూడా పెంచడం లేదు.కేవలం ఇంటి ముందు అందంగా కనిపించడం కోసం ఆ కోడిని పెంచుకుంటారట.

ఆంధ్రాలోని పలు జిల్లాల్లో ఈ కోళ్లను అందం కోసం పెంచుకుంటున్నారు.పర్లాజాతి కోళ్లు అన్ని కోళ్లలో హుందాగా, అందంగా ఉంటాయి.

అవి ఠివీగా, ఎంతో గాంభీర్యంగా ఉంటాయి.అందుకే వాటిని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకునేందుకు ఎక్కువ శాతం ఆంద్రా వారు కోరుకుంటున్నారు.

పెద్ద తోక ఉండటం వీటి ప్రత్యేకత, లక్షలు పెట్టి కోళ్లను కొనలేని వారు రెండు మూడు గుడ్లను కొనుగోలు చేసి వాటిని పొదిగించి, వాటి ద్వారా వచ్చే పిల్లలను పెంచుకుంటారు.

ప్రకాశం జిల్లా కంభంకు చెందిన కృష్ణమాచారి పర్లాజాతి కోళ్లను పెంచుతున్నాడు.ఆ కోళ్లతో మంచి లాభాలను అర్జిస్తున్నాడు.కృష్ణమాచారి పెంచుతున్న కోళ్లను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలు మరియు దేశాలు కూడా తరలిస్తున్నాడు.

దేశ విదేశాల్లో ఈ జాతి కోళ్లకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా ఆయన పూర్తిగా కోళ్ల పెంపకంపై దృష్టి పెడుతున్నాడు.ఈ జాతికి చెందిన కోడి పుంజు రెండు లక్షల రూపాయల రేటు పలుకుతున్న కారణంగా మామూలు కోళ్ల కంటే ఈ కోళ్లను పెంచడం బెటర్‌ అని అంతా అనుకుంటున్నారు.

అయితే అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ కోళ్లు పెరగవు.అతి వేడి, అతి చలి ఉన్న ప్రదేశాల్లో ఈ జాతి కోళ్లు పెరగవు.తెలుగు రాష్ట్రాల్లో ఇవి చాలా బాగా పెరుగుతాయి.

పర్లాజాతి కోడి పుంజులు హుందాగా ఉండటంతో పాటు అదృష్టంగా కూడా కొందరు భావిస్తున్నారు.మరి మీకు అవకాశం ఉంటే తప్పకుండా పర్లాజాతి కోళ్ల పెంపకం మొదలు పెట్టండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube