ప్రస్తుతం చాలా మందిలో కోవిడ్ భయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.కోవిడ్ చాలా మంది జీవితాలను అతలాకుతలం చేసింది.
మరెంతో మందిని కోలుకోకుండా చేసింది.ఇలా కరోనాతో బాధపడేవారిని చూసి చాలా మంది జంకుతున్నారు.
అసలు కొంత మంది మాత్రం కళ్లను చూసే కరోనా తీవ్రతను గురించి గుర్తిస్తున్నారు.అసలు ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు మన కళ్లలోని కార్నియాలో ఉండే నెర్వ్ డ్యామేజ్ చూసి మనకు వచ్చింది లాంగ్ కోవిడా? కాదా అని ఇట్టే చెబుతారు.ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజం.
అనేక రకాల వ్యాధులకు మన కంటిలోని కార్నియాలో అనేక రకాల మార్పులు ఏర్పడతాయి.అందువల్ల మనకు కోవిడ్ సోకినపుడు కళ్లను చూసి అది లాంగ్ కోవిడా కాదా అనేది ఇట్టే చెప్పేస్తారంట నిపుణులు.
ఈ విధానాన్ని కార్నియల్ కాన్ ఫోకల్ మైక్రోస్కోపీ అని వ్యవహరిస్తుంటారు.

శాస్త్రవేత్తలు ఈ విధానం ద్వారా దాదాపు కరోనా సోకిన 40 మందిని మరియు ఆరోగ్యంగా ఉన్న 30 మందిని పరీక్షించి చూడగా… ఆరోగ్యంగా ఉన్న వారిలో కార్నియాలో ఎటువంటి మార్పలు కనిపించలేదని, కానీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కార్నియా నెర్వ్ ఫైబర్ డ్యామేజ్, లాస్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు.అంతే కాకుండా అలాంటి వారిలో డెన్ డ్రిటిక్ సెల్స్ ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు.కావున కరోనా సోకిన వారి నరాలు డ్యామేజ్ అవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ విధానాన్ని పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు.ఈ పెరిఫెరల్ న్యూరోపతి మానవుల కళ్లను కేంద్రీకరించడంలో డబుల్ విజన్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
అంతే కాకుండా కొన్ని సార్లు కంటి నొప్పికి కూడా కారణమవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.