ఆ దేశంలో పదివేల మంది ప్రాణాలు తీసిన మద్యపాన నిషేధం?

ప్రపంచంలోని చాలా దేశాలకు మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయం చేకూరుతుంది.అందువల్లే చాలా దేశాలు మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు అపాయం జరుగుతుందని తెలిసినా మద్యంపై మాత్రం నిషేధం విధించవు.

 Long Ago Liquor Ban Refletes Tragedy In America  America, 1920 Liquor Ban, Paint-TeluguStop.com

అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాక ముందు నుంచి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేస్తోంది.అయితే మద్యపాన నిషేధం విధిస్తే ప్రజల ప్రాణాలకే అపాయం అని గతంలో జరిగిన ఒక ఘటన చెబుతోంది.

అమెరికాలో 1920 సంవత్సరంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యపాన నిషేధం విధించారు.అయితే అప్పటికే మద్యానికి బానిసలైన చాలామందికి మద్యం దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయాలను ఆలోచించారు.పెయింట్లు, ఇథైల్ ఆల్కహాల్ లాంటి కెమికల్స్ తో తయారైన మద్యాన్ని తాగారు.అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇథైల్ ఆల్కహాల్ లో కెమికల్స్ మిక్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కెమికల్స్ మిక్స్ చేసిన ఇథైల్ ఆల్కహాల్ ను తాగిన మద్యం ప్రియులు ప్రాణాలను కోల్పోయారు.అమెరికా రికార్డుల ప్రకారం అలా దాదాపు 10,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

మద్యం దొరక్క కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో మొదట మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని చెప్పిన వారే ఆ తరువాత మద్యపాన నిషేధం ఎత్తేయాలని ఉద్యమం చేశారు.

అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌‌వెల్ట్‌ చివరకు మద్యపాన నిషేధం ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే అనధికారికంగా చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఈ ఘటనను పలువురు చరిత్రకారులు అమెరికా చరిత్రలోనే విషాదకరమైన ఘటనగా పేర్కొంటారు.

ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకునే ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోంది.రాబోయే రెండేళ్లలో ఏపీలో పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం అమలు కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube