బాతు తలతో వంటకం ...రెస్టారెంట్ లో ఆ ఫుడ్ రుచే వేరు

ప్రపంచంలో ప్రతిచోట భోజన ప్రియులను ఆకర్శించడానికి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తున్నారు రెస్టారెంట్ యాజమాన్యం.తాజాగా అలా భోజన ప్రియులను ఆకర్శించడానికి లండన్ కు చెందిన వెస్ట్రన్స్ లాండ్రీ అనే రెస్టారెంట్ ఓ వింతైన వంటకాన్ని తయారు చేసింది.

 London Western Laundy Restaurant Serving Stuffed Duck Neck Details,  Stunnfed He-TeluguStop.com

ఈ హోటల్ వాళ్ళు ‘స్టఫడ్ డక్’ అనే వంటకాన్ని తయారుచేసి కస్టమర్లకు వడ్డించారు.ఈ వంటకం చూడడానికి ఎంతో వింతగా ఉంది.

ఒక బాతును చంపి, దాని తల లోపలి మాంసాన్ని మొత్తం తీసేసి మిగిలిన గొట్టం వంటి భాగంలో పప్పులు, ఇతర మాంసం ముక్కలు వేసి కిందభాగాన్ని ఒక తాడుతో గట్టిగా మూసివేస్తారు.తర్వాత దాన్ని బాగా ఉడికిస్తారు.

సాధారణంగా అయితే తలకు ముందు వెనుకా ఉన్న భాగాలను కట్ చేసి తాడుతో మూసివేస్తారు.కానీ వెస్ట్రన్స్ లాండ్రీ రెస్టారెంట్ వాళ్ళు మాత్రం దానికి భిన్నంగా బాతు తలను కింది భాగంలో మాత్రమే కత్తిరించి, ముక్కు భాగాన్ని అలానే ఉంచి కొత్తగా ఒక వంటకాన్ని సిద్ధం చేశారు.

 ఈ వంటకాన్ని ఒక వ్యక్తి ఫొటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

దీంతో హోటల్ వారి క్రియేటివిటీ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇలా ఒకవైపే కాల్చడం వలన రుచిగా ఉంటుందని ఒకరు కామెంట్ చేయగా., దీన్ని చూస్తుంటే ఇక జీవితంలో మాంసాన్ని తినకూడదని నిశ్చయించుకున్నానంటూ మరొకరు కామెంట్ చేశారు.ఏది ఏమైనా ఇలా వివిధ రకాల వంటకాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు చూడడం పరిపాటిగా మారిపోయింది మనకి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube