కోవిడ్ పరీక్షల కోసం డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.. బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలన్న తప్పనిసరిగా కరోనా పరీక్షల రిపోర్ట్.

 London Trip Was Costly For Debina Banerjee Gurmeet As Thousand -rupees Were Spen-TeluguStop.com

వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర బాలీవుడ్ నటి ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ డెబీనా బెనర్జీకి కూడా కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియ చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇటీవల తన భర్త గుర్మీత్ చౌదరీతో కలసి లండన్ వెకేషన్ కు వెళ్లింది.

కరోనా అధికంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ లండన్ లో కి వెళ్ళగానే అక్కడ సిబ్బంది కరోనా పరీక్షలు చేయాల్సిందేనని వీరి దగ్గర నుంచి 30 వేల రూపాయలను కేవలం కోవిడ్ పరీక్షల కోసం తీసుకున్నారని తెలిపారు.

Telugu Corona, Coronavirus, Covid, Debina Banerjee, Gurmeet, London Trip-Movie

ఇలా లండన్ లోకి ప్రవేశించగానే పరీక్షల కోసం 30 వేలు ఖర్చు పెట్టామని అనంతరం తిరిగి వస్తున్న సమయంలో మరో 30 వేల రూపాయలు పెట్టి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని,ఇలా కోవిడ్ పరీక్షలకే మా డబ్బులన్నీ అయిపోయాయని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక ముంబైలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేకుండా మమ్మల్ని మెయిన్ గేట్ నుంచి బయటకు పంపించలేదని డేబీనా దంపతులు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube