ఇక లండన్ నుంచి సిడ్నీకి నాలుగు గంటలే జర్నీ

సాధారణంగా లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లాలంటే ఎంత లేదన్నా 24 గంటలు పడుతుంది.అయితే ఇక మీదట ప్రయాణికులకు ఈ కష్టాలు తీరనున్నాయి.

 London To Australia Distence Will Overcome With New Space Technology-TeluguStop.com

కేవలం నాలుగు గంటల్లోనే సిడ్నీకి వెళ్లే అత్యాధునిక సూపర్‌సోనిక్ విమానాన్ని యూనైటెడ్ కింగ్‌డమ్ స్పేస్ ఏజెన్సీ రూపొందిస్తోంది.మంగళవారం లండన్‌లో జరిగిన యూకే స్పేస్ కాన్ఫరెన్స్-2019లో ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది.

Telugu Telugu Nri Ups, Ukaustralian-

ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీతో యూకే స్పేస్ ఏజెన్సీ ‘‘వరల్డ్ ఫస్ట్ స్పేస్ బ్రిడ్జి’’ కింద ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇప్పటి నుంచి ఇరుదేశాలు ఈ ప్రాజెక్ట్‌పై పనులు ప్రారంభించనున్నాయి.ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి సినర్జిటిక్, ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్‌ను అమరుస్తారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రియాక్షన్ ఇంజిన్‌లపై జరిపిన ప్రయోగం విజయవంతమైంది.ఆ సమయంలో ఇది ధ్వనికి మూడు రెట్ల వేగంతో గంటకు 3.3 మ్యాక్ స్పీడుతో దూసుకెళ్లినట్లు యూకే స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.ఈ స్పేస్ ప్లేన్‌లో లైట్‌వెయిట్ ఎఫెషీయన్సీ ప్రొపల్షన్ వ్యవస్థను అమర్చనున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే 2030 నాటికి ఈ స్పేస్ ప్లేన్ అందుబాటులోకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube