భారతీయులపై లండన్ శాస్త్రవేత్తల పరిశోధనలు..ఎందుకంటే       2018-04-16   03:10:47  IST  Bhanu C

భారతీయులు అన్ని రంగాలలో ముందు ఉంటారు..ప్రపంచ దేశాలలో భారతీయులు ఉన్న అన్ని ప్రాంతాలలో వారి హవా నడుస్తుంది..అక్కడ వారు ఎంతో కీలకంగా ఉంటారు..అసలు అమెరికా లాంటి రాష్ట్రం వీసా నిభంధనలు అమలు చేస్తోందంటే దానికి ముఖ్యమైన కారణం అక్కడ భారతీయుల ప్రభావం ఎక్కవగా ఉంటోంది..అసలు భారతీయులు ఇంతటి ప్రభావం ఒక వ్యవస్థపై ఎలా చూపించగలరు..దానికి ఉన్న ప్రత్యేకమైన కారణాలు ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు బహుసా చాలా మందికి వచ్చే ఉంటాయి అయితే ఈ విషయాలని తెలుసుకోవడానికి లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ గుంటర్‌ షుమెన్‌ బెంగళూరులోని నిమ్‌హాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేస్తున్నారు.

భారతీయులకు, యూరోపియన్లకు మధ్య ఉన్న తేడా ఏమిటి? అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.. అందుకు గాను ‘కన్సార్షియం ఆన్‌ వల్నరబిలిటీ టు ఎక్స్‌టర్నలైజింగ్‌ డిజార్డర్స్‌ అండ్‌ అడిక్షన్స్‌’ పేరిట దాదాపు 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నారు..అయితే ఈ అధ్యయనానికి భారత్‌కు చెందిన ఐసీఎంఆర్‌-బ్రిటన్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు అందిస్తున్నాయి.

దాదాపు 10 కోట్లు కేవలం ఈ అధ్యయనానికి కేటాయించారు అంటే ఇది సామాన్యమైన అధ్యయనం కాదు అని అంటున్నారు.

భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు.. బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ పదివేల మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారంతో పాటు వారి జీవితానికి సంబంధించిన అన్ని వివరాలనూ సేకరించారు అలాగే యూరప్ లో ఉన్న వారి జీవన విధానానికి సంభందించి కూడా అధ్యయనం చేస్తున్నారు..

యూరప్‌ అయితే భారతీయులకి భాద్యత యూరప్ లో ఉన్న వారితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది..భారతీయులు ఎక్కువగా బృందాలలో పనిచేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు…ఈ విషయాన్ని అధ్యనం చేయడానికి మేము రెండు ప్రాంతాల వారికి కూడా ఎన్నో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.. వీటన్నింటి ఆధారంగానే ఈ అభిప్రాయానికి వచ్చారు శాస్త్రవేత్తల బృందం…ఇదే అధ్యయనానికి నిమ్‌హాన్స్‌కు చెందిన భారత ప్రొఫెసర్‌ వివేక్‌ కూడా సహకరిస్తున్నారు.