వావ్.. కేవలం కుక్కను తిప్పితే లక్షల్లో జీతం..!  

London Law Firm Dog walker Job offer , Job offer , Dog walker , Professional, London, 29 Lakhs - Telugu 29 Lakhs, Dog, Dog Taker, Dog Walker, England, Job Offer, London, London Law Firm Dog Walker Job Offer, Professional, Salary

పురుషులందు పుణ్య పురుషులు వేరయా లాగా.ఉద్యోగాలు అందు కొన్ని ఉద్యోగాలు వేరయా అన్నట్టుగా కొన్ని ఉద్యోగాలు వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి.

TeluguStop.com - London Law Firm Profession Dog Walker Job Offer

కొన్ని కంపెనీలు వారి కంపెనీ యొక్క కాఫీ, బిస్కెట్లు రుచి చూసి చెప్పినందుకు వేలకు వేలు.లక్షలకు లక్షలు.

జీతాలు ఇస్తున్నాయి.ఇప్పటివరకు కాఫీ తాగడం, బిస్కెట్లు తిని రుచి చూడడం లాంటి ఉద్యోగాలను చాలా విచిత్రంగా అనిపించిన చాలా మంది వాటి వల్ల ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు.

TeluguStop.com - వావ్.. కేవలం కుక్కను తిప్పితే లక్షల్లో జీతం..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే ఈ లిస్టులో మరో ఉద్యోగం కూడా జరిగింది.అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.


తాజాగా లండన్ నగరంలోని జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌ అనే న్యాయవాద సంస్థ ఓ విచిత్రమైన ఉద్యోగాన్ని ప్రకటించింది.ఆ ఉద్యోగం ఏమిటంటే ఆ సంస్థలో పని చేస్తున్న ఓ సీనియర్ సభ్యుడు వద్ద ఓ పెంపుడు కుక్క ఉందట.

ఇకపోతే ఆ కుక్కకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వాటిని రోడ్లపైకి వాకింగ్ కు తీసుకువెళ్లాలని.అందుకోసం పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వారి దరఖాస్తులు కోరుతున్నారు.

అయితే ఈ ఉద్యోగానికి ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా…? ఏకంగా 30 వేల పౌండ్ల జీతం సంవత్సరానికి అందజేస్తున్నారు.అంటే మన భారత కరెన్సీలో సంవత్సరానికి 29 లక్షల రూపాయలు.

దీని ప్రకారం చూస్తే మన భారత కరెన్సీలో ఒక నెలకు రెండు లక్షల పైన జీతం తీసుకోవచ్చు.ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సిన వారు కుక్క ను ప్రేమించిన వారే ఉండాలి.

ఈ ఉద్యోగానికి ఆడ, మగ అని తేడా లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.ఇకపోతే ఈ ఉద్యోగానికి అనుభవం కచ్చితంగా అవసరం అని ప్రకటనలో తెలిపారు.ఉద్యోగానికి కేవలం జీతం మాత్రమే కాకుండా పింఛన్ జీవిత బీమా లతో పాటు ప్రైవేటు ఆరోగ్య భీమా అనేక సదుపాయాలను అందించబోతున్నారు.ఇందుకు సంబంధించి ఆ కుక్కను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ పెంపుడు కుక్క యొక్క బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది.

వీటితో పాటు డాగ్ వాకర్ కూర్చున్న చోటనే కూర్చోకుండా కుక్క వెంట లండన్ నగరంలోని వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఆ ఉద్యోగి ఫిట్ నెస్ కూడా ఎంతో అవసరమని షరతులను పెట్టింది.అంతేకాదు ప్రతి వారం శని, ఆదివారాలు కూడా సెలవు దినాలు.

రోజువారి పని వేళల్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

#29 Lakhs #Professional #London #Dog Taker #LondonLaw

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

London Law Firm Profession Dog Walker Job Offer Related Telugu News,Photos/Pics,Images..