లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బీసీ బిల్లు     2019-01-08   23:01:20  IST  Sai Mallula

ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న సమయంలో కేంద్ర అధికార పార్టీ హడావుడిగా ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ (124) బిల్లు 2019పై నాలుగున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ లో 323 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ముగ్గురు సభ్యులు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు.

Loksabha Passes Ebc Reservation Bill-

Loksabha Passes Ebc Reservation Bill

అయితే… ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఏఐఏడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. చర్చ ముగింపు దశకి చేరుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభకు వచ్చారు. ఓటింగ్ సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా లోక్ సభలో ఉన్నారు. రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది.