ఇక కుమారుడి వంతు...!  

Lokesh’s Us Tour To Raise Investments For Ap-

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు పెట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలన్నీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు.రాజధాని నిర్మాణాన్ని విదేశాలకు అప్పగిస్తున్నారు.దేశాలు తిరిగి తిరిగి బాబుకు అలసట వస్తున్నట్లుగా ఉంది.ఇక పెట్టుబడులు సమీకరించే బాధ్యతను బాబు కుమారుడు, టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్‌ తీసుకుంటున్నాడట…! అమెరికా నుంచి ఐదొందల మిలియన్‌ డాలర్లు సేకరించేందుకుగాను లోకేష్‌ మే మూడో తేదీన అక్కడికి ప్రయాణం అవుతున్నాడట.బాబు జపాన్‌, చైనా, సింగపూర్‌, జర్మనీ వెళ్లొచ్చారు.దీంతో అమెరికా వెళ్లే పని లోకేష్‌ తీసుకున్నాడు.లోకేష్‌ పూర్తి కసరత్తు చేసి వెళుతున్నాడని నాయకులు చెబుతున్నారు.పెట్టుబడిదారులను ఆకర్షిచేవిధంగా వివిధ రకాల డాక్యుమెంట్లు, బ్రోచర్లు తయారు చేయించారట.ఆయన అనేకచోట్ల బిజినెస్‌ మీటింగులు పెట్టి, ఎంఎన్‌సి ప్రతినిధులతో, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరుపుతారని చెబుతున్నారు.

Lokesh’s Us Tour To Raise Investments For Ap---

లోకేష్‌ గనుక అమెరికా నుంచి భారీగా పెట్టుబడులు సంపాదించగలిగితే పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించడం గ్యారంటీ.అమెరికాకు వెళ్లి పెట్టుబడులు తేలేకపోయినా ఆయన స్థానానికి ముప్పు లేదనుకోండి.భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడానికి ఇది ట్రయినింగ్‌ అయివుండొచ్చు.