మళ్లీ బాబే రావాలి.. అంటే లోకేష్ వద్దా ?

మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మార్మోగుతోంది.మళ్లీ చంద్రబాబు సారధ్యంలోని 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని , మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లో విస్తృతంగా జరుగుతోంది.

 Lokeshs Undeveloped Preference In The Tdp Chandrababu Lokesh, Nara, Tdp, Cbn, Ys-TeluguStop.com

ఒంగోలు లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం నిన్న ప్రారంభమైంది.దాని కంటే ముందు రోజు చంద్రబాబు మహానాడు కోసం మంగళగిరి నుంచి ఒంగోలు కు బయల్దేరారు.

ఈ సందర్భంగా ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం చెప్పారు టిడిపి నాయకులు .మంగళగిరి నుంచి ప్రారంభమైన చంద్రబాబు పట్టాభిపురం, పెదకాకాని ఎడ్లపాడు , తదితర చోట్ల ఆయనకు భారీస్థాయిలో స్వాగతం లభించింది.

        ఇక బయట మహానాడు లోనూ పూర్తిగా చంద్రబాబు పేరు మారుమోగుతోంది.పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కీలక నిర్ణయాలు,  పార్టీ నాయకులకు పదవులు ఇలా అన్ని తానై చంద్రబాబు నిర్వహిస్తున్నారు.

దీంతో 2024 ఎన్నికలు మొత్తం లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతాయని భావించినా,  వారికి ఇప్పుడు ఈ పరిణామాలు అంతు పట్టడం లేదు లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా,  ఆయన సారధ్యంలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటిస్తే జరిగే నష్టం ఏమిటో చంద్రబాబు ఆ పార్టీ నాయకులకు తెలుసు.అందుకే ఆ నష్టం జరగకుండా ముందుగానే చంద్రబాబు మేల్కొని లోకేష్  ను అంతగా ఫోకస్ చేయడం లేదట.

ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు  ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.దీంతో లోకేష్ పాత్ర పరిమితంగానే ఉండబోతోంది అనే విషయం  ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
   

Telugu Ap, Tdp Mahanadu, Ysrcp-Politics

  చంద్రబాబు వయసు పైబడినా, పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే తపనతో నిరంతరం కష్టపడుతున్నారు తప్ప పూర్తిగా తెలుగుదేశం బాధ్యతలను లోకేష్ కు  అప్పగించేందుకు బాబు సైతం ఇష్ట పడకపోవడంతో పార్టీలోనూ లోకేష్ శక్తి సామర్థ్యాలపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube