అక్కడ లోకేష్ మళ్లీ ఓడిపోయాడు ?   

lokesh troubled on mangalagiri constency panchayathi elections results, chandrababu, jagan, alla ramakrishnareddy ,panchyathi elections - Telugu Alla Ramakrishnareddy, Ap, Chinababu, Local Body Elections, Lokesh, Mangaalagiri, Panchayathi, Tdp, Ysrcp

టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతటి రాజకీయ మేధావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర చెప్పలేనిది.ఇప్పటికీ ఏడుపదుల వయసులో ఆయన పడుతున్న కష్టం గురించి సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీల లోనూ చర్చ జరుగుతూనే ఉంది.రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆ స్థాయిలో ఇష్టం ఉండబట్టే, ఈ స్థాయిలో అలుపెరగకుండా పోరాడుతున్నారు.

TeluguStop.com - Lokesh Troubled On Mangalagiri Constency Panchayathi Elections Results

ఇక ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విషయానికి వస్తే, గతంలో తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ఓనమాలు దిద్దిన లోకేష్ ఆ తరువాత సొంతంగా తెలుగుదేశం పార్టీలో తన ప్రభావం పెరిగే విధంగా చేసుకుంటూ వస్తున్నారు.అన్ని విషయాల్లోనూ పట్టు సాధిస్తూ, చంద్రబాబు స్థాయి వ్యక్తిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉండడంతో, అక్కడ తప్పనిసరిగా గెలుస్తా అనే నమ్మకం పెట్టుకున్న లోకేష్ కు ఓటమి తప్పలేదు.దీంతో మరింత కసిగా ఆ నియోజకవర్గం పై లోకేష్ దృష్టి పెట్టారు.

కానీ ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపించింది.మంగళగిరి నియోజకవర్గం పరిధిలో మొత్తం 18 పంచాయతీలకు తొలిదశలో ఎన్నికలు జరగగా, వైసిపి మద్దతుదారులు 14 చోట్ల గెలిచారు.

TeluguStop.com - అక్కడ లోకేష్ మళ్లీ ఓడిపోయాడు  -Political-Telugu Tollywood Photo Image

తెలుగుదేశం పార్టీ 04 స్థానాలకు పరిమితమై పోవడంతో, లోకేష్ ప్రభావం అంతంత మాత్రమే అనే విషయం మరోసారి తేలిపోయింది.

ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా లోకేష్ కొనసాగుతున్నారు.

ఈ నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే కసి తో ఉన్నారు.కానీ అందుకు తగ్గ స్థాయిలో లోకేష్ ఈ నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోవడం, పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేయకపోవడం ఇలా ఎన్నో కారణాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకోలేకపోయింది.2019 ఎన్నికల్లో ఓటమి చెందిన లోకేష్ , ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ పట్టు సాధించలేక పరోక్షంగా మరోసారి ఓటమి చెందింది.చంద్రబాబు తర్వాత పార్టీ పూర్తి బరువు బాధ్యతలు మోయాల్సిన లోకేష్ మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేయాలని, చూస్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోవడంతో, సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టిపెట్టాలని, లేకపోతే మరో సేఫ్ నియోజకవర్గం ను ఎతుక్కోవాలని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారు.

#Ysrcp #Lokesh #Chinababu #LocalBody #Panchayathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు