లోకేష్ ను భయపెడుతున్న ఎన్టీఆర్ ? 

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీలు నడిపించేది ఎవరా అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా అందరు చెప్పే పేరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పేరు ఎందుకంటే ఆయన పనితీరు ఎలా ఉన్నా, ఆయన వల్ల పార్టీకి నష్టం జరిగినా, బాబు వారసుడు కాబట్టి టిడిపి పగ్గాలు చినబాబు లోకేష్ కే అప్పగిస్తారు.అందులో ఎటువంటి సందేహం లేదు.

 Lokesh Tention On Ntr Slogan On Tdp-TeluguStop.com

అందుకే బాబు తెలివిగా లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం పెంచారు.ఆయన రాజకీయ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు.

లోకేష్ కోసం నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని సైతం పక్కనపెట్టారు.దీనిపై రాజకీయంగా, కుటుంబ పరంగా విమర్శలు వచ్చినా, బాబు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడు అనే విషయం అయితే అందరికీ అర్థం అయ్యింది.

 Lokesh Tention On Ntr Slogan On Tdp-లోకేష్ ను భయపెడుతున్న ఎన్టీఆర్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు తనకు సంబంధం లేదన్నట్టుగానే సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు.అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తున్నా అది వెంటనే సర్దుమణిగిపోతోంది.

ప్రస్తుతం చూస్తే తెలుగుదేశం పార్టీ  తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.చివరికి గట్టి పట్టున్న హిందూపురం, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ పరిస్థితి చేయి దాటిపోయింది.ఎప్పుడూ లేనివిధంగా అక్కడ పంచాయతీ ఎన్నికలలో టిడిపి మద్దతు దార్లు ఓడడం, వైసీపీ మద్దతుదార్లు ఎక్కువ స్థానాల్లో గెలవడంతో టీడీపి చిక్కుల్లో పడడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు, నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగిన బాబు కు ఊహించనీ సంఘటన ఎదురైంది.

జూనియర్ ఎన్టీఆర్ ను కుప్పం నియోజకవర్గంలో ప్రచారానికి తీసుకురావాలని, రాష్ట్రవ్యాప్తంగానూ జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు కు పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ పెద్దగానే వినిపించడంతో నోరు తెరచి సమాధానం చెప్పలేని స్థితిలో బాబు ఉండిపోయారు.అసలు జూనియర్ ఎన్టీఆర్ సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ వస్తూనే ఉంది.కానీ ఎక్కడా ఎవరూ లోకేష్ పేరు పలకకపోవడం, టీడీపీకి పునర్వైభవం తీసుకొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని టీడీపీ కార్యకరతలతో పాటు, జనాల్లోనూ తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని నమ్మడం ఇటువంటి పరిణామాలు లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారాయి.

పార్టీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తుండడం లోకేష్ కు ఆందోళన కలిగిస్తోంది.

#Nara Lokesh #LocalBody #Jr NTR #Ysrcp #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు