మోడీ కి, వైసీపి ఎంపీలు “కాపలా”...లోకేష్ “షాకింగ్ కామెంట్స్”     2018-05-23   21:58:06  IST  Bhanu C

చంద్రబాబు నాయుడి తనయుడు..ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ తన స్పీడు పెంచుతున్నారు..విమర్శలు చేయడంలో కానీ ప్రతిపక్షాలకి కౌంటర్ ఇవ్వడంలో కానీ లోకేష్ దూకుడు చూస్తున్న సీనియర్ నేతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు తండ్రి ఏపీలో లేని సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించే లోకేష్ ఈ సారి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు..అంతేకాదు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు వదులుతూ పొలిటికల్ హీట్ పుట్టించారు.

అయితే ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పై లోకేష్ సాఫ్ట్ గానే రెస్పాండ్ అయ్యారు..పవన్ కళ్యాణ్ కి ఎవరో రాంగ్ ఫీడ్ ఇచ్చారు అందుకే కిడ్నీ భాదితుల గురించి పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అంటూ బదులు ఇచ్చారు..

-

ఉద్ధానం ప్రజల కిడ్నీ సమస్యను ప్రభుత్వం దృ,ష్టికి తెచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు..

అంతేకాదు ఉద్దనం వాళ్ళకోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అయితే ఇంకా చేయాల్సింది ఉందని ఆయన లోకేష్ మీడియా ముందు తెలిపారు.

అంతేకాదు చంద్రబాబు కి జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కొత్తేమి కాదని అన్నారు. బుధవారం ఆయన మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు…అన్ని పార్టీలనూ కలుస్తామని, రాష్ట్రానికి న్యాయం చేస్తామని లోకేష్ తెలిపారు…అంతేకాదు జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు…రోడ్డుపై ఎంతో మంది వెళ్తూ ఉంటారు అందరి గురించి మాట్లాడమంటే ఎలా అసలు A1 A2 లకు తాను సమాధానం చెప్పాలా అంటూ మండిపడ్డారు..

మోడీపై మాట్లాడే దమ్ము గానీ దైర్యం కానీ లేని వాళ్ళు కూడా మాట్లాడటం ఎంతో హాస్యాస్పదమని..గుడిలో లింగాన్ని గుడిని మింగేసే వ్యక్తిత్వం వారికే ఉందని తిరుమలలో కనపడటంలేదని అంటున్న విలువైన వజ్రాలు అన్నిటిని సీబీఐ వెలికి తీస్తుందని అన్నారు..అవన్నీ లోటస్ పాండ్ తవ్వి మరీ వెలికి తీస్తుందని అన్నారు లోకేష్.