కళ..తప్పినా కళా వెంకట్రావ్..లోకేష్ ఎఫెక్ట్ కారణమా..       2018-07-04   02:11:41  IST  Bhanu C

రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా..కొండ మీద కోతి అయినా దిగి రావాల్సిందే అయితే మరి లోకేష్ బాబు తలుచుకుంటే ఏపీలో ఎక్కడ ఎవరి స్థానం నుంచీ అయినా పోటీ చేయగలడు అయితే లోకేష్ బాబు కోరికకి బలై పోయే ఏమ్మేలే ఎవరు చెప్మా అంటే తెరపైకి కొత్తగా మరొక పేరు వస్తోంది..ఆయన ఎవరో కాదు వారి పరిస్థితి ఎలా ఉంటుందో మరి..అయితే తాజాగా లోకేష్ బాబు చూపు కళా వెంకట్రావ్ స్థానం ఎచ్చెర్ల పై పడింది దాంతో కళ మొఖంలో కళ తప్పింది..ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక కళ టెన్షన్ ఫీల్ అవుతున్నారని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

అయితే లోకేష్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తునాని చెప్పిన వెంటనే..పై పైకి మా స్థానం నుంచీ పోటీ చేయండి అంటే మా స్థానం నుంచీ పోటీ చేయండి అంటూ ఎదో మాటవరసకి కొంత మంది ఎమ్మెల్యేలు ప్రకటించారు అయితే ఇప్పుఫులోకేష్ బాబు మీ ఇష్టం మేరకే పోటీ చేస్తా అని చెప్పడంతో అందరి తెగ టెన్షన్ పడుతున్నారు అయితే చినబాబు చూపు మాత్రం ఎచ్చెర్ల పై పడిందట దాంతో కళ తెగ కంగారు పడుతున్నారని తెలుస్తోంది..అయితే లోకేష్ తమ సామజిక వర్గం ఎంతో బలంగా ఉండే కృష్ణా గుంటూరు వైపు కాకుండా ఇటువైపు ఎందుకు చూస్తున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది..అదేంటంటే..

ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం..ఉత్తరాంధ్రలో పార్టీ వీక్ గా ఉందని చెప్పాయట అంతేకాదు సర్వేలు సైతం ఇదే రిపోర్ట్ బాబు ముందు ఉంచడంతో కంగారు పడిన బాబు లోకేష్ ని అటుగా పంపితే పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని అంచనా వేశారట అంతేకాదు ఒక నెల క్రితం లోకేష్ ఉత్తరాంధ్ర లో చేపట్టిన యాత్ర సక్సెస్ కావడంతో పాటు లోకేష్ మీద క్రేజ్ ఉందని తెలిసిందట దాంతో చంద్రబాబు లోకేష్ ని తెలుగుదేశానికి ఎంతో అచ్చొచ్చిన ఎచ్చెర్ల వైపు పంపాలని డిసైడ్ అయ్యారట.

అయితే కళా ఎలాగో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు అంతేకాదు కాబట్టి, ఎన్నికలలో ప్రచారం కోసం వాడుకుని ఆనక పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చేలా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్…మొత్తానికి ఈసారి కళాకు టికెట్ ఇచ్చే అవకాశం లేనే లేదు అంటే టాక్ మాత్రం టీడీపీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది..అయితే అసలు లోకేష్ కి పట్టులేని చోట అనవసరంగా పోటీ చేయిస్తే చేతులు కాల్చుకోవడమే తప్ప ప్రయోజనం ఉండదు అంటున్నారు విశ్లేషకులు.