జగన్ ప్రారంభోత్సవాలపై లోకేష్ పంచ్ లు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.ఈరోజు జగన్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపడుతున్నారు.

 Lokesh Setairical Comments On Jagan , Nara Lokesh, Jagan,tdp,ysrcp, Jagan Openin-TeluguStop.com

ముఖ్యంగా వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం తో పాటు, అనేక పరిశ్రమల ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలు జగన్ చేపట్టారు.ముఖ్యంగా ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లకు నేడు తిరుపతిలో జగన్ శంకుస్థాపన చేశారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ పవర్ హౌస్ గా ఏపీ మారిపోతోందని, 2913 కోట్ల రూపాయల పెట్టుబడులు దీనికోసం పెట్టనున్నారని వైసిపి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 15వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అని చెబుతోంది.

ఇదంతా వైసీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ ఉండడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.ఏపీలో అనేక పరిశ్రమలు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, వాటిని తిరిగి వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ .ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ వైయస్ జగన్ తెచ్చింది కాదు అని ఫైర్ అయ్యారు.ఏపీ ని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలితంగానే ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చాయని లోకేష్ చెప్పుకొచ్చారు.

Telugu Jagan, Jagan Tirupathi, Lokesh, Tdp, Tirupathi, Ysrcp-Politics

ఎవరికో పుట్టిన బిడ్డ కి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరో సారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.ఇక టీడీపీ సోషల్ మీడియా కూడా ఈ వ్యవహారాలపై విమర్శలు చేస్తూ పోస్టింగ్స్ వైరల్ చేసింది.ప్రస్తుతం తిరుపతిలో జగన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న కంపెనీ గతంలో చంద్రబాబు, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ తెచ్చిన కంపెనీ లేనని, వాళ్ళు కష్టపడి పెట్టుబడిదారులను ఒప్పించి రాష్ట్రానికి కంపెనీలో తీసుకువస్తే.

అవేవో తాము తీసుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా విభాగం విమర్శలు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube