జగన్- పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే...?   Lokesh Serious Warning To Pavan Kalyan And Jagan     2018-10-20   15:45:28  IST  Sai M

ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన మాటలకు పదును పెట్టాడు. ఏకకాలంలో తమ పార్టీకి ప్రత్యర్థులైన జగన్ పవన్ కళ్యాణ్ లను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించాడు.ప్రతిపక్ష నేత జగన్‌ తనపై కేసులు పెట్టుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి లోకేష్. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని , ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని ఆయన చెప్పారు.

పవన్‌, జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. లక్ష కోట్లు దోచేసి జైలుకెళ్లిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. సాయం చేసే అలవాటు లేని జగన్‌, పవన్‌.. చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.