సైకో మనస్తత్వం అంటూ జగన్ పై నారా లోకేష్ ఫైర్..!!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ని అరెస్ట్ చేయటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించటం జరిగింది.

 Lokesh Serious Comments On Ys Jagan-TeluguStop.com

కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే ఇలాంటి సమయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని చాలామంది నేతలు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ కూడా రఘురామకృష్ణంరాజు ని అరెస్టు చేయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ ఈ రీతిలో ఉంది నియంత కంటే ఘోరంగా ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ ప‌ట్టించుకోకుండా, త‌న క‌క్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి వైయస్ జగన్.

 Lokesh Serious Comments On Ys Jagan-సైకో మనస్తత్వం అంటూ జగన్ పై నారా లోకేష్ ఫైర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్య‌లు చేశార‌ని వై కేట‌గిరి భ‌ద్ర‌త‌లో వుంటూ ఇటీవ‌లే బైపాస్ స‌ర్జ‌రీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయ‌న పుట్టిన‌రోజు నాడే అరెస్ట్ చేయించ‌డం జ‌గ‌న్‌రెడ్డి సైకో మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం.ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువ‌ల్ డిపార్ట్‌మెంట్ గా మారిపోయింది.

ప్ర‌శ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీతో ధ్వంసం,లొంగ‌క‌పోతే పీసీబీ త‌నిఖీలు.ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌.

జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.” అని తీవ్ర స్థాయిలో నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

#YS Jagan #AP CID #Lokesh #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు