వైసీపీ ప్రజా ప్రతినిధులు కామాంధులు అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కామాంధులు అంటూ తనదైన శైలిలో పోస్టులు పెట్టారు.

 Lokesh Serious Comments On Ycp Public Representatives-TeluguStop.com

లోకేష్ ఏమన్నారంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో? అని పేర్కొన్నారు.

విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణం.దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరం.వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దు.

 Lokesh Serious Comments On Ycp Public Representatives-వైసీపీ ప్రజా ప్రతినిధులు కామాంధులు అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి.అంటూ లోకేష్ సీరియస్ అయ్యారు.

#Lokesh #YS Jagan #Lokesh #Venkat Rao #AP Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు