ఖైదీ దర్శకుడితో కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్  

Lokesh Kangaraj New Project With Kamal Hassan, Kollywood, Master Movie, Hero Vijay, Director Lokesh Kanagaraj , Kamal Hassan - Telugu @ikamalhaasan, Director Lokesh Kanagaraj, Hero Vijay, Kamal Hassan, Kollywood, Lokesh Kangaraj New Project With Kamal Hassan, Master Movie

ఖైదీ సినిమాతో తమిళ, తెలుగు భాషలలో కార్తితో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్.ఈ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న లోకేష్ వెంటనే స్టార్ హీరో విజయ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు.

 Lokesh Kangaraj New Project With Kamal Hassan

మాస్టర్ టైటిల్ తో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధమైంది.ఈ సినిమా మీద తమిళనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అదే సమయంలో లోకేష్ కనగరాజ్ నుంచి ఖైదీ సీక్వెల్ కోసం ఆ సినిమా అభిమానులు వేచి చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ క్రేజీ దర్శకుడు విలక్షణ నటుడు, స్టార్ హీరో కమల్ హాసన్ తో ఒక సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

ఖైదీ దర్శకుడితో కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వీరిద్దరి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

విలక్షణ నటుడు కమల హాసన్ నటించే 232వ చిత్రం ఇది కావడం విశేషం.

ఈ చిత్రాన్ని కమల్ తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.యువ సంగీత దర్శకుడు అనిరుథ్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా సినిమా నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ చాల కొత్తగా డిజైన్ చేశారు.ఒకానొక సమయంలో అక్కడ ఒక దెయ్యం నివసించేది అని అర్థం వచ్చేలా ఇంగ్లిష్ లో క్యాప్షన్ కూడా పెట్టారు.

ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే కమల్ ఈ సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు అంటే భారతీయుడు సీక్వెల్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్లేనా అనే మాట ఇప్పుడు కోలీవుడ్ లో వినిపిస్తుంది.

#Hero Vijay #DirectorLokesh #Kollywood #@ikamalhaasan #LokeshKangaraj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lokesh Kangaraj New Project With Kamal Hassan Related Telugu News,Photos/Pics,Images..