విజయ్ సినిమా స్టోరీ లీక్.. ఈసారి ఆ కథతో రాబోతున్నాడట!

లోకేష్ కనగరాజ్.ఈ పేరు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఇతడు విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా తన పేరు మారుమోగి పోయేలా చేసాడు.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చాడు.

ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో సూపర్ హిట్ గా నిలిచి రికార్డ్ కలెక్షన్స్ కూడా సాధించింది.ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఎవరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లోకేష్ విజయ్ దళపతి తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఇక ఇప్పుడు విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని ఇప్పటికే ప్రకటించారు.విజయ్ లోకేష్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.

దళపతి తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ తో చేయనున్నాడు.తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ప్రెజెంట్ లోకేష్ విజయ్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.విక్రమ్ కంటే హై లెవల్ లో ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేలా లోకేష్ సిద్ధం చేస్తున్నాడట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందట.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

1940 కాలం నాటి అతి భయంకరమైన డాన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో కథ ప్రచారం అవుతుంది.ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి కథ కూడా అలా హై లెవల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు లోకేష్.మరి ఈ సినిమా కథ ఇదేనో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు