మెగా హీరో రామ్ చరణ్ తో ఖైదీ దర్శకుడు నెక్స్ట్ సినిమా  

Lokesh Kanagaraj locked for Ram Charan, Tollywood, Kollywood, Mega Hero, Mytri Movie Makers - Telugu Kollywood, Lokesh Kanagaraj Locked For Ram Charan, Mega Hero, Mytri Movie Makers, Tollywood

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

TeluguStop.com - Lokesh Kanagaraj Locked For Ram Charan

Source:TeluguStop.com

అయితే లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత షూటింగ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశాడు.అయితే తక్కువ క్రూతో షూటింగ్ సాధ్యం కాదని మళ్ళీ వెనకడుగు వేశారు.

TeluguStop.com - మెగా హీరో రామ్ చరణ్ తో ఖైదీ దర్శకుడు నెక్స్ట్ సినిమా-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం రాజమౌళితో పాటు అతని కుటుంబం కరోనా బారిన పడ్డారు.ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఈ పరిస్థితిలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.ఇదిలా ఉంటే స్టార్ హీరోలు లాక్ డౌన్ టైంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లకి ప్లాన్ చేసుకుంటున్నారు.

అందుకోసం దర్శకులని పిలిపించుకొని కథలు వింటున్నారు.కొంత మంది ఫోన్ ద్వారా కథలు వింటున్నారు.

ఈ నేపధ్యంలో లాక్ డౌన్ టైంలో కొత్త కాంబినేషన్ లో తెరపైకి వస్తున్నాయి.ఇప్పటికే కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్స్ అయ్యింది.దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.అలాగే త్రివిక్రమ్, తమిళ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్లు టాక్ వస్తుంది.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది.తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కిన ఖైది సినిమాతో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం మైత్రీ మూవీ మేకర్స్ రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

అందులో ఒకటి మల్టీ స్టారర్ కాగా మరొక సినిమా రామ్ చరణ్ తో ఉంటుందని తాజా అప్డేట్.ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో ఉంటుందని సమాచారం.

ఈ కాంబినేషన్ ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాలి.

#Kollywood #Mega Hero #LokeshKanagaraj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lokesh Kanagaraj Locked For Ram Charan Related Telugu News,Photos/Pics,Images..