ఆచితూచి అడుగులేస్తున్న లోకేష్‌.. అయినా వారు లెక్క‌చేయ‌ట్లేదా..?

నారా లోకేష్ అంటే చంద్ర‌బాబు కుమారుడిగా.భ‌విష్య‌త్‌లో టీడీపీని న‌డిపించే నాయ‌కుడిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ ఆయ‌న తండ్రి వార‌స‌త్వాన్ని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి.దాంతో ఆయ‌న పోటీ చేసిన మొద‌టి ఎన్నిక‌ల్లో కూడా ఓడిపోయారు.దీంతో ఆయ‌న నాయ‌కత్వంపై పూర్తిగా అంద‌రికీ న‌మ్మ‌కం పోయింది.ఇంకోవైపు ఆయ‌న మాట్లాడేట‌ప్పుడు కూడా త‌డ‌బ‌డ‌టంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు ఘోరంగా వ‌చ్చేవి.

 Lokesh Is Stepping In Achituchi  But They Do Not Count , Lokesh, Tdp,latest News-TeluguStop.com

ఇక ఏదైనా స‌భ జ‌రిగిన‌ప్పుడు లేదంటే ఎవ‌రి ఇంటికైనా ప‌రామ‌ర్శ‌కు వెళ్తే కూడా య‌న వ్య‌వ‌హార తీరు ఎన్నోసార్లు విమ‌ర్శ‌ల‌కు గురి చేసింది.

దీంతో ఆయ‌న వ్యూహం మార్చుకున్నారు.

ఇలా అయితే లాభం లేద‌నుకుని త‌న డ్రెస్సింగ్ స్టైల్ ద‌గ్గ‌రి నుంచి వ్య‌వ‌హార తీరు వ‌ర‌కు అన్ని మార్చుకుంటున్నారు.మరీ ముఖ్యంగా ఆయ‌న యూత్ ను తన వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బాగానే ఉందనే మార్కులు పడుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

త‌న బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలానే మార్పులు చేసుకున్నారు.ఎక్క‌డ‌కు వెళ్లినా హుందాగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఎవ‌రికి స‌మ‌స్య వ‌చ్చినా కూడా వెంట‌నే స్పందిస్తూ వెళ్లి వారిని ప‌రామ‌ర్శిస్తున్నారు.ప్ర‌భుత్వాన్ని క‌డిగిపారేస్తున్నారు.

Telugu Ap, Chandra Babu, Lokesh, Lokesh Achituch-Telugu Political News

ఇక ప్ర‌భుత్వంపై చేసే విమ‌ర్శ‌ల్లో కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.కాగా ఆయ‌న ఇంత‌లా మార్పులు చూపిస్తున్నా కూడా ఎక్కడో ఏదో వెలితి క‌నిపిస్తోంది.అదేంటంటే ఆయ‌న్ను సొంత పార్టలోని కాస్తా లెక్క చేయడం లేద‌ని చెబుతున్నారు.ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్య‌క్తి గెలిచిన త‌మ‌పై ఎలా పెత్త‌నం చేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.ఆయ‌న విష‌యంలో సీనియ‌ర్లు ఎవరూ కూడా సానుకూలంగా వ్యవహరించడం లేదనే చ‌ర్చ పార్టీలో న‌డుస్తోంది.చంద్రబాబుకు అటు పార్టీలో ఇటు ప్ర‌జ‌ల్లో ఉన్న ఫాలోయింగ్ లో కొంత మేర‌కు కూడా లోకేష్ సంపాదించుకోలేక పోయార‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube