గుంటూరు టీడీపీ నేత కరణం ప్రభాకర్ అరెస్ట్ పై లోకేష్ సీరియస్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర కడప జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రజా సమస్యల విషయంలో.

 Lokesh Is Serious About The Arrest Of Guntur Tdp Leader Karanam Prabhakar Detail-TeluguStop.com

ప్రభుత్వ విధి విధానాలపై.లోకేష్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం సీఎం జగన్( CM Jagan ) పోలవరం ప్రాజెక్టును సందర్శించడం తెలిసిందే.అయితే జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించటంపై లోకేష్ సెటైర్లు వేశారు.

పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసిన పాపాల పాలకుడు జగన్ రెడ్డి అని విమర్శించారు.

గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేత కరణం ప్రభాకర్( Karanam Prabhakar ) అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధ్యత గల పౌరుడిగా ప్రభాకర్ ప్రశ్నించటం ఏ సెక్షన్ ప్రకారం నేరమో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు.తప్పుడు కేసుల్లో అరెస్టులు చేయించి… జగన్ రెడ్డికి అలుసు వస్తుందేమో గాని.

టీడీపీ కేడర్ కి కాదని హెచ్చరించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మరింత ఊపొస్తుందని అన్నారు.

కరణం ప్రభాకర్ అక్రమ అరెస్టునీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.తమ వైపు న్యాయం ఉందని… ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని లాక్కోలేరని… ప్రభాకర్ నీ వెంటనే విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube