మహిళల భద్రత విషయంలో సీఎం జగన్ పై సీరియస్ అయిన లోకేష్..!!- Lokesh Is Serious About Cm Jagan Regarding Womens Safety

lokesh is serious about cm jagan regarding womens safety, Ys jagan, Lokesh, kadapa, disha - Telugu Disha, Kadapa, Lokesh, Ys Jagan

సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో మహిళల రక్షణకు దిక్కులేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.రాష్ట్రంలో దిశ చట్టం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఆడ వాళ్లకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.

 Lokesh Is Serious About Cm Jagan Regarding Womens Safety-TeluguStop.com

కడప జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్యకు ప్రభుత్వం సరైన వైద్యం అందించాలి అంటూ సోషల్ మీడియాలో లోకేష్ డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఇప్పటినుండి మహిళలపై దృష్టి పెట్టాలని సూచించారు.

 Lokesh Is Serious About Cm Jagan Regarding Womens Safety-మహిళల భద్రత విషయంలో సీఎం జగన్ పై సీరియస్ అయిన లోకేష్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహిళలపై అత్యాచారానికి అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాలకు కఠినంగా శిక్షలు విధించాలని లోకేష్ డిమాండ్ చేశారు.కడప జిల్లాలో జోళ్ళు లావణ్య(17) అనే అమ్మాయిపై సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది.

సునీల్ అనే వ్యక్తి మూడు నెలల నుంచి లావణ్య వెంటపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దీంతో రక్తపు మడుగులో ఉన్న లావణ్యను స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేయడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వైద్యం విషయంలో లావణ్యకు ప్రభుత్వం నుండి సరైన సహాయం అందడం లేదని లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో విమర్శలు చేయటం వైరల్ గా మారింది.

#Kadapa #YS Jagan #Disha #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు