అలాంటి ప‌నులే ప‌దే ప‌దే చేస్తున్న లోకేష్‌.. క‌లిసి రావ‌ట్లేదే..

టీడీపీ భావి అధినేత‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మాత్రం మొద‌ట్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా కూడా ఇప్పుడు పూర్తిగా త‌న వ్య‌వ‌హారాన్ని మార్చుకుని మ‌రీ రాజ‌కీయాల్లో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.కాగా ఇప్ప‌టికే చేస్తున్న కొన్ని ప‌నుల‌తో ఆయ‌న తమ్ముళ్ళు తెగ మురిసిపోతున్నారు.

 Lokesh Is Doing The Same Thing Over And Over Again Lokesh, Politics,latest News-TeluguStop.com

అయితే లోకేష్ ఎంత సేపు కేవ‌లం పరామర్శల‌కే ప‌రిమితం కావ‌డంతో అది పెద్ద‌గా క‌లిసిరావ‌ట్లేద‌ని తెలుస్తోంది.ఆయ‌న ప్ర‌తి సారి ఎవరో ఒక‌రు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు లేదంటే ఇంకవ‌రైనా బాధితులు చనిపోతేనే వెళ్ళడం చేస్తున్నారు.

ఇక రీఆసెంట్ గా ఆయ‌న గుంటూరులో రమ్య అనే బీటేక్ స్టూడెంట్ చ‌నిపోతే ఆమె ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్వించి జ‌గ‌న్ స‌ర్కారును ఓ రేంజ్‌లో ఆడుకోవ‌డం మ‌నం చూశాం.అయితే ఆ విమ‌ర్శ‌ల‌క చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్లాన్ వేసి వెంట‌నే వారికి జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్పందించింది.

ఇక దీంతో రమ్య కుటుంబం జగన్ ప్ర‌భుత్వాన్ని మెచ్చుకుని ఆయ‌న‌కు ఫుల్ స‌పోర్టు చేసింది.జగన్ ప్ర‌భుత్వం త‌మ కుటుంబానికి న్యాయం చేసింద‌ని వారికి ధ‌న్య‌వాదాలు అంటూ తెల‌ప‌డం ఇక్క‌డ లోకేష్ కు పెద్ద మైన‌స్ అయిపోయింది.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Lokesh, Ysrcp-Telugu Political News

అయితే ఇలా లోకేష్ కేవ‌లం ప‌రామ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అవుతూ సింప‌తీ పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కూడా అవి పెద్ద‌గా క‌లిసి రాక చివ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాటికి చెక్ పెట్టేస్తుంది.కానీ ఆయ‌న మాత్రం పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌ట్లేదు.క‌నీసం ఒక్క పోరాటం కూడా చూపించ‌ట్లేదు.దీంతో ఇటు తెలుగు త‌మ్ముళ్లు అటు ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే వాద‌న కూడా ఉంది.కానీ ఇలాంటి స‌మ‌యంలోనే ఆయ‌న దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెడితే స‌క్సెస్ అవుత‌రానే వార్త‌లు వ‌స్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube