లోకేష్ పోటీ చేసే స్థానం డిసైడ్ .. ఎక్కడో తెలిస్తే షాకే       2017-11-14   01:09:13  IST  Bhanu C

రానున్న ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి..కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టేంతగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ కనుక తన సత్తా చాటకపోతే రాజకీయ భవిష్యత్తు మాత్రం దూరం అయిపోయినట్టే. అందుకే లోకేష్ వేస్తున్న ప్రతీ అడుగు చంద్రబాబు చాల దగ్గరగా మోనిటర్ చేస్తున్నాడు..లోకేష్ ఎక్కడి నుంచీ పోటీ చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. అయితే లోకేష్ ని ఎక్కడి నుంచీ పోటీ చేయాలనే దానిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రాకపోయినా..టిడిపి నాయకుల సమాచారం మేరకు ఎక్కడి నుంచీ పోటీ చేసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లోకేష్ హిందూపురం నుంచి పోటీ చేస్తాడని అనుకుంటే మరి కొందరు లోకేష్ కోసం చంద్రబాబు తన స్థానం అయిన కుప్పం ఇస్తారు అని చెప్తున్నారు… లోకేష్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు..అయితే ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని కొందరు టీడీపీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు…మరి కొందరు మాత్రం గుడివాడ నుంచీ లోకేష్ ని పోటీలోకి దింపాలని ఇది ఎన్టీఆర్ సొంతూరు కాబట్టి ఇక్కడినుంచీ..పోటీ చేయాలని..కొందరు టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కొడాలి నాని టిడిపి అభ్యర్ధిగా గుడివాడ నుంచీ పోటీ చేసి గెలిచారు..దాని తరువాత వైసిపిలోకి వెళ్ళిన నాని మరోమారు ఎమ్మెల్యేగా వైసీపి నుంచీ గెలవడం అక్కడ టిడిపి నాయకులు జీర్ణించుకోలేకపోయారు..అందుకే కొడాలి నానికి అక్కడ ఓటమి చూపించే సత్తా లోకేష్ కి మాత్రమే ఉందని..అందరం దగ్గర ఉండి మరీ గెలిపించుకుంటాము అని చెప్తున్నారు.

అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారు అని ఆయన ఆదేశిస్తే గుడివాడ నుంచీ పోటీ చేస్తాను అని చెప్పడంతో అధినేత వద్దకి కూడా ఇదే అంశాన్ని గుడివాడ నేతలు తీసుకువేల్లినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే లోకేష్ మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం గుడివాడ నుండే అన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి.మరి కొడాలి నాని ఈ విషయంలో ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.