ఛాలెంజ్‎ను స్వీకరించే దమ్ము లోకేశ్ కు లేదు.. మాజీమంత్రి అనిల్

టీడీపీ నేత నారా లోకేశ్ కు తన సవాల్ ను స్వీకరించే దమ్ము లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

సీఎం జగన్ తో తన భేటీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సిల్లీ బచ్చా.ఆఫ్ టికెట్ లోకేశ్ కి మాట్లాడటం కూడా రాదని విమర్శించారు.

మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు బేసిక నాలెడ్జ్ లేని లోకేశ్ వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.తన కొడుకు అక్షరాభ్యసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేశ్ అంటూ ధ్వజమెత్తారు.రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి తనపై గెలవాలని చూస్తున్నారన్నారు.2024లో ఎవరికి ఎవరు బుల్లెట్ దింపుతారో ప్రజలే డిసైడ్ చేస్తారని స్పష్టం చేశారు.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?
Advertisement

తాజా వార్తలు