ఎంతపని చేసావ్ లోకేష్ ..వైసీపీలోకి టీజీ   Lokesh Did Blender Mistake About Tg Venkatesh     2018-07-11   02:35:13  IST  Bhanu C

నారా లోకేష్ రాజకీయ దూకుడు కారణంగా కర్నూల్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ పై పట్టు పెంచుకునే పనిలో భాగంగా కర్నూలు జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. జిల్లాకి సంబంధించి ఇప్పటిదాకా ముగ్గురికి 2019 ఎన్నికలే టార్గెట్‌గా చేసుకుని, టిక్కెట్లను ఖరారు చేసేశారు. వీరిలో సిట్టింగ్‌ ఎంపీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.
ఫలితంగా.. టీడీపీనేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వచ్చారట. దీనంతటికి కారణం లోకేష్ దూకుడే అనే వాదనలు ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్నాయి.

అసలు ఇక్కడ ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటంటే… 2019 ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్‌ని ఆశిస్తున్నారు టీజీ వెంకటేష్‌. కానీ, టీజీ వెంకటేష్‌ కోరికని నారాలోకేష్‌ లైట్‌ తీసుకున్నారు. దాంతో, టీజీ వెంకటేష్‌ సహజంగానే అలకబూనారు. లోకేష్ పై తన అనుచరుల దగ్గర నిప్పులు చెరిగారు. ఇదే అదునుగా వైసీపీ రంగంలోకి దిగింది. టీజీ వెంకటేష్‌ సన్నిహితులు.. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలకు, ‘టీడీపీలో టీజీ అసహనంపై’ సమాచారాన్ని ‘ప్రత్యేకంగా’ చేరవేశారట దీనిపై జగన్ఆ నిర్ణయమే కీలకం కాబోతోందట.

ఈ పరిస్థితుల్ని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా పసిగట్టిన టీడీపీ అధినాయకత్వం, టీజీ వెంకటేష్‌ని బుజ్జగించే చర్యలూ చేపట్టిందట. పార్టీ నుంచి నేతలు జారిపోకుండా వుండేందుకోసం లోకేష్ అత్యుత్సాహంతో అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారనీ, చివరి నిమిషంలో చంద్రబాబు రాజకీయాలు ఎలాగైనా ఈక్వేషన్స్‌ని మార్చేయొచ్చనీ టీడీపీలో టీజీ సన్నిహిత వర్గం అభిప్రాయపడుతోంది. టీజీ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందినచకపోయినా… జగన్ నుంచి టికెట్ విషయంలో స్ప్రష్టమైన హామీ వచ్చినా వైసీపీలోకి వెళ్లేందుకు వెనుకాడబోమని టీజీ తన సన్నిహితుల దగ్గర చెప్తున్నాడట. టీజీ వ్యవహారం ఏమైనా చినబాబు తొందరే ఈ పరిస్థితికి కారణం అనేది కర్నూల్ పాలిటిక్స్ లో వినిపిస్తున్న మాట.