చేతికి సంకెళ్లతో లోకేష్ బాబు.. ఎందుకంటే..?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు నేటితో నాలుగో రోజుకు చేరుకున్నాయి.ప్రజల అసెంబ్లీ గేటు దగ్గర ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయనతో పాటు టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 Tdp, Jagan Mohan Reddy, Chandrababu Naidu, Lokesh, Andhra Pradesh State Assembly-TeluguStop.com

ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు కాలినడకన రావడంతో పాటు.వివిధ వర్గాల పై దాడులు, అలాగే అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలు అనుమతించకపోవడంతో టిడిపి వర్గానికి చెందిన వారు సంకెళ్ళు, నల్ల కండువాలతో వారి నిరసనను తెలియజేశారు.

ఇందులో భాగంగానే టిడిపి పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతులకు సంకెళ్లు వేసుకొని కాస్త వినూత్నంగా ఆందోళన చేపట్టాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఉపయోగించుకుని కక్షసాధింపు పనులు చేస్తోందని, అంతేకాకుండా కౌంటర్ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి చినరాజప్ప తన ఆందోళనలను తెలియజేశాడు.

వీటితో పాటు రాష్ట్రం మొత్తంగా రైతుల మీద అనేక దాడులు జరుగుతున్నాయని, వారితో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.నంద్యాలలో జరిగిన దారుణ ఘటన సలీం కుటుంబం ఆత్మహత్య పై జగన్ సర్కార్ స్పందనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం నాయకులు చలో అసెంబ్లీకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదని అలాగే ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీకి ఎవరైతే ఓటు వేసి గెలిపించారో ఆ వర్గాల పైనే ప్రస్తుతం రాష్ట్రంలో దాడులు జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Assembly, Chandrababu, Law, Lokesh-Latest News - Telugu

వీటితోపాటు తాను, కొల్లు రవీంద్ర బీసీలో పుట్టడం తాము చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు.మేము బీసీలం కాబట్టే తమ మీద కేసులు పెట్టారని ప్రశ్నించాడు అచ్చెన్నాయుడు.అలాగే అసెంబ్లీలో కొన్ని మీడియా ఛానల్ కు సంబంధించి ఎంట్రీ లేకపోవడం ఉద్దేశించి అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాచి పెట్టడానికి జగన్ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలకు బంద్ చేసిందని అంటూ ఆరోపించారు.వీటితో పాటు కేవలం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడినప్పుడు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా లైవ్ వస్తుందని అదే ప్రతిపక్ష నేతలు మాట్లాడినప్పుడు లైవ్ కనపడటం లేదని ఆయన వాపోయాడు.

శాసనసభలో జరిగే ప్రజా సమస్యలపై జరిగే చర్చలు ప్రజలకు తెలియకుండా కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నట్లు ఆయన వాటిపై మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube