తిమ్మరుసులో 'తియ్యగుంది'.. మాజీ మంత్రి డైలాగ్ అలా వాడరుగా!

సినిమాలలో డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అనేవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.అంతేకాకుండా అందులో ఏదైనా కామెడీ డైలాగ్ వస్తే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

 Lokesh Babu Tiyyagundi Dialogue In Thimmarusu Movie-TeluguStop.com

ఇక కొందరు దర్శకులు బయట విన్న డైలాగులను కూడా సినిమాలలో చూపిస్తుంటారు.అలాంటిదే ప్రస్తుతం ఓ డైలాగ్ తెగ వైరల్ గా మారింది.

అది కూడా ఓ రాజకీయ నాయకుడు వాడిన డైలాగ్.

 Lokesh Babu Tiyyagundi Dialogue In Thimmarusu Movie-తిమ్మరుసులో తియ్యగుంది’.. మాజీ మంత్రి డైలాగ్ అలా వాడరుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత కొన్ని రోజుల నుండి కోవిడ్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయగా తాజాగా థియేటర్ లు తెరచుకున్నాయి.

ఈ నేపథ్యంలో పలు సినిమాలు విడుదల కాగా అందులో తిమ్మరుసుసినిమా కూడా విడుదలయ్యింది.ఈ సినిమాకు చరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు.ఇందులో సత్యదేవ్ కీలక పాత్రలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ఇందులో మరో నటుడు బ్రహ్మాజీ నటించగా ఆయన తన పాత్రతో మంచి కామెడీని అందించాడు.

Telugu Brahmaji, Lokesh Babu Majjiga Sweet, Nara Lokesh, Satya Dev, Thimmarusu Movie, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరోతో పాటు బొండం తాగుతూ తియ్యగుందీఅనే డైలాగ్ కొట్టడంతో ఈ డైలాగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఎందుకంటే గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి నారా లోకేష్ బాబు మంగళగిరిలో పర్యటన చేస్తున్న సమయంలో ఓ పెద్దావిడ మజ్జిగ ఇవ్వగాదాన్ని తాగుత ఏం వేసావ్ ఇందులో చక్కెరా తియ్యగుంది అని అనడంతో ఆ మాటకి చాలామంది చక్కెర వేస్తే తియ్యగా ఉండకపోతే ఉప్పగా ఉంటుందా అని తెగ ట్రోల్ చేశారు.దీంతో ఈ డైలాగ్ అలా వైరల్ గా మారడంతో రామ్ గోపాల్ వర్మ కూడా తన సినిమాలో ఈ డైలాగును వాడుకున్నాడు.ఇక ప్రస్తుతం తిమ్మరుసు సినిమాలో కూడా ఈ డైలాగ్ వాడగా.

ప్రేక్షకులను తెగ నవ్వించింది.మొత్తానికి బ్రహ్మాజీ వేసిన డైలాగ్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో అందరూ మళ్లీ నారా లోకేష్ డైలాగ్ ను గుర్తు చేసుకొని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

#Thimmarusu #Lokesh #Satya Dev #LokeshBabu #Brahmaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు