ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా టీడీపీ సరికొత్త వెపన్ రెడీ  ? 

ఈ మధ్యకాలంలో టీడీపీ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదే పదే వస్తోంది.ఆయన టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు వయసు అయిపోయింది అని , లోకేష్ పార్టీని నడపలేరు అని, ఆయన వస్తేనే పార్టీకి పునర్ వైభవం వస్తుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 Lokesh Appearing In Mass Look Is An Attempt To Impress The Youth, Nara Lokesh, C-TeluguStop.com

అలాగే చంద్రబాబు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వస్తూ , ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కానీ లోకేష్ ను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి తెచ్చేందుకు ఇష్టపడరు.

అదేసమయంలో లోకేష్ ను ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే లోకేష్ బాడీ లాంగ్వేజ్ తో పాటు,  టీడీపీ తరఫున వైసీపీ నేతలకు సవాళ్ళు విసురుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ లోకేష్ తాను అసమర్థ లీడర్ ని కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Chandrababu, Jr Ntr, Ntr, Lokeshmass, Mass Lokesh, Lokesh, Lokesh Mass, P

టీడీపీ తరఫున ఏ విషయం పైన అయినా, లోకేష్ మాత్రమే స్పందిస్తున్నారు.ఆ పార్టీ నాయకులు సైతం లోకేష్ ను ప్రమోట్ చేస్తూ,  ఆయన జగన్ కు సరైన ప్రత్యర్థి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.ఇక లోకేష్ సైతం తాను క్లాస్ లీడర్ కాదు అని, మాస్ లీడర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కువగా యువతను ఆకట్టుకునే విధంగా జాగ్రత్త పడుతున్నారు.

యూత్ మద్దతు ఉంటే రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన గ్రహించారు.జగన్ , పవన్ విషయానికి వస్తే , వీరిద్దరికీ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.

వారి కారణంగానే వారికి ఆ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.లోకేష్ ను పార్టీలో యువ నాయకులు సైతం పెద్దగా పట్టించుకోని పరిస్థితి.

ఏపీలోని యూత్ ఎవరు లోకేష్ ను ఇష్టపడకపోవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.అందుకే ఇకపై మాస్ లుక్ తో కనిపిస్తూ,  యూత్ ను ఆకట్టుకోవడమే టార్గెట్ గా లోకేష్ పెట్టుకున్నారట.

ప్రస్తుతం లోకేష్ గడ్డంతో కనిపిస్తున్నారు.

Telugu Chandrababu, Jr Ntr, Ntr, Lokeshmass, Mass Lokesh, Lokesh, Lokesh Mass, P

అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాన్ని , యువతను ఆకట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట.అది కాకుండా లోకేష్ గతంతో పోలిస్తే బాగా సన్నబడడం, తెలుగు మాట్లాడేందుకు పెద్దగా ఇబ్బంది పడకపోవడం,  వైసీపీ ప్రభుత్వం ధైర్యంగా విమర్శలు చేసే స్థాయికి ఎదగడం,  ఇలా అన్ని విషయాల్లోనూ సత్తా చాటుకుంటూ ఉండడం తో ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ఉండాలి అని, అలా చేస్తేనే  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా ఉంటుంది అని బాబు ముందుగా ఈ విధంగా జాగ్రత్త పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube