అచ్చెన్న కు జై .. లోకేష్ మాటకు నై ? బాబు డేరింగ్ స్టెప్ ?  

lokesh angry on chandrababu desistion about achhennaidu issue TDP, ysrcp, Jagan, achennaidu, lokesh ,party Mangalagiri elections media , - Telugu Achennaidu, Jagan, Lokesh, Party Mangalagiri Elections Media, Tdp, Ysrcp

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు ప్రాధాన్యం పెంచాలని, అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయనను సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఆయనకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు.

TeluguStop.com - Lokesh Angry On Chandrababu Desistion About Achhennaidu Issue

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి లోకేష్ పెద్దగా జనం లోకి రావడం లేదు.హైదరాబాదులో ఇంటికే పరిమితం అయిపోతున్నారు.

వయసు పైబడినా, చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలపై చురుగ్గా వ్యవహరిస్తున్నారు.రానున్న రోజుల్లో లోకేష్ కు పార్టీ కి సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించడంతో పాటు, పూర్తిగా ఆయన మాట వినేలా, పార్టీ పుంజుకునే విధంగా ఒక కొత్త టీమ్ ను చంద్రబాబు నియమిస్తూ వస్తున్నారు.

TeluguStop.com - అచ్చెన్న కు జై .. లోకేష్ మాటకు నై బాబు డేరింగ్ స్టెప్ -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇంచార్జిలను నియమించారు. 

అప్పుడే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును చంద్రబాబు ప్రకటిస్తారని అంత అభిప్రాయపడగా, బాబు మాత్రం ఆ పేరును ప్రకటించలేదు.

అయితే అకస్మాత్తుగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక లోకేష్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.సాధారణంగా దూకుడు స్వభావం గా ఉండే అచ్చెన్నాయుడు కి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే, పూర్తిగా పార్టీని కంట్రోల్లోకి తీసుకుంటారని, ఎవరిని లెక్క చేసే విధంగా ఆయన వ్యవహరించారు అని, రానున్న రోజుల్లో చంద్రబాబు యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడంతో అచ్చెన్న కు అడ్డు ఉండదు అని, ఇది తన రాజకీయ ఎదుగుదలకు అంత మంచిది కాదు అనే అభిప్రాయంతో లోకేష్ అచ్చెన్నాయుడు ఎంపికను ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.

అయితే చంద్రబాబు మాత్రం అచ్చెన్న అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఒడ్డున పడేయగలరు అని, ఆయనకు కాకుండా ఎవరికి ఆ బాధ్యతలు ఇచ్చినా, పార్టీని నడిపించలేరు అని, వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటూ, తెలుగుదేశం పార్టీ ని నడిపించాలి అంటే అది అచ్చెన్న కు మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారట. 

అందుకే త్వరలోనే ఆయన పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నట్లుగా టిడిపి అనుకూల మీడియా ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

ఈ విషయంలో లోకేష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుతం లోకేష్ మాట విని,  వేరే వారికి పార్టీ ని అప్పగిస్తే  ఇప్పుడు పార్టీకి ఉన్న పరిస్థితి కూడా ఉండదని, అప్పుడు చేసేది ఏమీ ఉండదనే అభిప్రాయంతో దాదాపు అచ్చెన్న పేరుని ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

.

#Ysrcp #Jagan #Lokesh #Achennaidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lokesh Angry On Chandrababu Desistion About Achhennaidu Issue Related Telugu News,Photos/Pics,Images..