'లోక్ సత్తా' పనైపోయినట్లే??

ఒక స్వచ్చంద సంస్థగా ప్రజల్లోకి వచ్చి.ఆ తరువాత పార్టీగా రూపు మార్చుకుని…ప్రజలే పాలించాలి అన్న నినాదంతో 2009ఎన్నికల బరిలో దిగింది జయప్రకాష్ నారాయణ ‘లోక్ సత్తా’ పార్టీ.

 Lok Satta Chapter Close??-TeluguStop.com

అయితే కొత్త ఊపులో కూకట్ పల్లి నుంచి జే.పీ గెలిచినా.మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు.ఇదిలా ఉంటే 2009లో టీడీపీ పార్టీ ఓటమికి బలమైన కారణం కూడా లోక్ సత్తా అని అధికారికంగానే తెలుగుదేశం విమర్శలు చేసింది.

ఇంతవరకు బాగానే ఉన్నా…ఇప్పుడు లోక్ సత్తా పరిస్థితి అంతగా బాలేదు…ఏపీలోనే అంత సత్తా లేని లోక్ సత్తా మిగిలిన రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభించింది.ఆ మధ్య జాతీయ అధ్యక్ష పదవి నుంచి జేపీ తప్పుకుని ముంబైకి చెందిన సురేంద్ర శ్రీవాస్తవకు పగ్గాలు అప్పగించారు.

ఇదే ఇప్పుడు ఆ పార్టీ కొంప ముంచుతోంది.ఈ ఎన్నికను రాష్ట్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు.అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించకుండా… నామినేటెడ్ విధానంలో జాతీయ అధ్యక్షుడిని ప్రకటించారంటూ డీవీవీఎస్ వర్మ, కటారి శ్రీనివాసరావు, రమేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీన్ని సహించలేని జాతీయ నాయకత్వం.

ఆ ముగ్గురు ముఖ్యనేతలను సస్పెండ్ చేసింది.లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, జాతీయ సమితి సభ్యుడు కటారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డిల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు…లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాత్సవ ప్రకటించారు.

లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడిగా ముంబయికి చెందిన సురేంద్ర శ్రీవాత్సవను వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విబేధాలు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో ముగ్గురు నాయకులను సస్పెండ్ చేస్తూ సురేంద్ర శ్రీవాత్సవ ఈమెయల్, ఎస్ఎంఎస్ ద్వారా సమచారం పంపించారు.

మరి మార్పు కోసం ఓర్పు వహించాలి అని చెప్పిన జేపీ మౌనం పుణ్యమా అంటూ లోక్ సత్తా షాప్ మూసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube