ఖమ్మం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ ‘ ప్రజాదీవెన’( Praja deevena ) పేరుతో బహిరంగ సభను నిర్వహించింది.ఈ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో తాము ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.దాదాపు 90 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఎన్నో సాధించిందన్న భట్టి ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుంటే పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.