లాడ్జి ముసుగులో వ్యభిచారం...

దేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు కన్నేసినప్పటికీ నిర్వాహకులు మాత్రం వ్యభిచారం నిర్వహించడానికి కొత్త కొత్త దారులు మరియు మంచి పనుల ముసుగులో కొన్ని చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి లాడ్జ్ నిర్వహణ పేరుతో లాడ్జి గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.

 Lodge Owner Arrested, Illegal Activity, Hyderabad, Crime News, Prostitution, Tel-TeluguStop.com

వివరాల్లోకి వెళితే వనస్థలిపురం పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి లాడ్జి గృహం నిర్వహిస్తున్నాడు.అయితే ఇటీవలే పోలీసులు పక్కా సమాచారంతో లాడ్జి లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారంతో లాడ్జ్ పై దాడులు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డాడు.కానీ లాడ్జి యజమాని మాత్రం తప్పించుకున్నాడు.అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.దీంతో తాజాగా పోలీసులు లాడ్జ్ యజమాని ని అరెస్టు చేశారు.

Telugu Hyderabad, Activity, Lodge, Telangana-Telugu Crime News(క్రైమ�

అయితే నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం విచారణలో పలు విషయాలను పోలీసులు కనుగొన్నారు.ఇందులో డబ్బు అవసరాల నిమిత్తమై వచ్చేటువంటి ఆడవాళ్ళకి డబ్బు ఎరగా వేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్ల్లు తెలుసుకున్నారు.మరికొందరైతే ఏకంగా జల్సాలకి అలవాటు పడి కూడా చేస్తున్నట్లు విచారణలో తెలుసుకున్నారు.అలాగే పలు సెక్షన్ల కింద లాడ్జ్ యజమాని పై కేసులు బనాయించి కటకటాల్లోకి నెట్టారు.

అంతేగాక ఉద్యోగాలు, పనులు నిమిత్తమై  పట్టణాలకు వచ్చేటువంటి యువతీ, యువకులు జాగ్రత్తగా ఉండాలని డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారిలో వెళ్లకుండా కష్టపడి పనిచేయాలని సూచించారు.ఒకవేళ డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కితే భవిష్యత్తులో కచ్చితంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube