చైనా వాళ్లే కాదు ఢిల్లీ ప్రజలు కూడా మిడతలు తింటారట!  

Locusts Meals Dish In Delhi - Telugu Delhi, Delhi People, Locusts Biryani, Locusts Dishes,

ఏంటి నిజామా? నిజంగానే మిడతలని ఢిల్లీ వాళ్ళు తింటున్నారా? మీకు షాక్ అని అనిపించినా సరే ఇది నిజం.మనం సోషల్ మీడియాలో చైనా ప్రజలపై జోకులు వేస్తున్నాం కానీ నిజంగానే ఢిల్లీ ప్రజలు కొందరు మిడతలను ఎంతో ఇష్టంగా తింటున్నారట.

 Locusts Meals Dish In Delhi

అసలు ఎక్కడ తింటున్నారు ? ఆ రెసిపీ ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
మన భారతీయులు ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినేవారట.

అయితే ఇప్పుడు మిడతలు మన దేశంపై దండెత్తిన సంగతి తెలిసిందే.అయితే ఆ మిడతలతోనే రాజస్థాన్‌లో రుచికరమైన బిర్యానీలను సిద్ధం చేశారు.ప్లేటు మిడతల బిర్యానీని రూ.200కు అమ్మారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక మిడతలు భారతీయులకు ఉన్న సంబంధాన్ని ఎంతో చక్కగా వివరించింది.

చైనా వాళ్లే కాదు ఢిల్లీ ప్రజలు కూడా మిడతలు తింటారట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలా వివరించిన సమయంలోనే ఢిల్లీలో ఓల్డ్ టౌన్‌లో నివసిస్తున్న కొంతమందిని మిడతల వంటకాల గురించి అడిగి తెలుసుకుంది.1960 కాలంలో ఢిల్లీ ప్రజలు మిడతలతో రకరకాల వంటకాలు తయారు చేసుకొనేవారని, కాలక్రమేనా వాటిని తినడం మానేశారని పలువురు వృద్దులు తెలిపారు.

1960 సమయంలో మిడతల కాళ్లు, రెక్కలు, తలలు, వెనుక భాగాలను తీసేసి నీటిలో వేసి కడిగే వారు అని ఆ తర్వాత ఉల్లిపాయాలతో కలిపి వాటిని బాగా వేపి, టమోటాలు, గరం మసాలా వేసే కూరలా చేసేవారు అని ఓ వృద్ధుడు చెప్పుకొచ్చాడు.కాగా మిడతలను ఆహారంగా తినడం గురించి కొన్ని మతాలకు చెందిన పవిత్ర గ్రంథాల్లో కూడా రాశారట.మిడతలను తింటే ఆరోగ్యంగా కూడా ఉంటారట.అయితే ఎక్కువ తింటే సమస్యలు ఏర్పడుతాయట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Locusts Meals Dish In Delhi Related Telugu News,Photos/Pics,Images..

footer-test