తెలుగు రాష్ట్రాలని టెన్షన్ పెడుతున్న మిడతల దండు

మిడతల దండు… ఇప్పుడు దీనికి ఇండియా మొత్తం భయపడుతుంది.భయంకరమైన రాకాసి మిడతలు లక్షల ఎకరాలలో పంటలని నష్టం చేస్తూ ఉంటాయి.

 Locusts Attack Crops In Telugu States, Lock Down, Agriculture, Telugu States-TeluguStop.com

ప్రతి ఏటా పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇవి దూసుకోస్తూ ఇండియాలో వ్యవసాయాన్ని నాశనం చేస్తూ ఉంటాయి.వీటి వలన వేలు నుంచి లక్షల ఎకరాలలో పంటలు ప్రతి ఏటా నాశనం అవుతూ ఉంటాయి.

ఇప్పుడు మరోసారి ఈ రాకాసి మిడతల దండి పాకిస్థాన్ నుంచి ఇండియాలోకి దూసుకోచ్చాయి.ఈ రాకాసి మిడతలు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి.

అక్కడి అధికారులు వీటిని నియంత్రించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.వాటి అక్కడ నియంత్రించడం సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది.

దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ అధికారులు నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తూ, చెట్లని ఆవాసం చేసుకొని సమీపంలో ఉండే పంటలకు నష్టం కలిగిస్తూ ఉంటాయి.

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు ఈ మిడతల దండు నుంచి వ్యవసాయాన్ని రక్షించడానికి అప్రమత్తం అయ్యారు.తమ బరువుకు సమానమైన ఆహారాన్ని రోజూ లాగించే వీటిల్లో సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది.

ఇక తెలంగాణ తరువాత ఏపీకి కూడా ఈ మిడతల దండు నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube