తంగేడు చెట్టుకు 5 తాళాలు..! కీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా.? అసలేమైంది అంటే.?       2018-07-03   23:54:08  IST  Raghu V

తంగేడు చెట్టుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు తాళాలు వేశారు. ఆ చెట్ల మొదట్లోనే తాళం చెవిలను పెట్టారు. పక్కన ఓ చీటి ఉంచారు. దానిపై తుకారాం అని రాసివుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఐకేపీ గోదాం పక్కనగల సాగుభూమిలో గుర్తుతెలియని వ్యక్తులు తంగెడు చెట్టు కొమ్మలకు అయిదు తాళాలు వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వేసినట్లు ఉన్నాయి. తాళం చెవులను సైతం అక్కడే వదిలేశారు. కాగా రెండో రోజుల క్రితం గ్రామానికి చెందిన మేకల కాపర్లు గమనించి విషయం గ్రామస్తులకు తెలిపారు.

ఎవరో అకతాయిలు ఇలా చేసివుంటారని.. భయపడాల్సిన పనిలేదని గ్రామస్థులకు చెప్పారు. బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. తాళం వేసిన వ్యక్తుల గురించి విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం తంగెడు చెట్టుకు వేసిన తాళాలను తొలగించి చెట్టుకొమ్మలను విరిచేశారు. 4జీ టెక్నాలజీ వచ్చినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు, తంత్రాలు అని కొందరు స్వార్థపరులు ప్రజలను భయపెడుతున్నారు అంటే ఇలాంటివి చూస్తే నమ్మాలనిపిస్తుంది.