లాక్ డౌన్ సమయంలో ట్యూషన్ చెబుతున్న టీచర్,పట్టించిన 5 ఏళ్ల బాలుడు

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ మహమ్మారి కారణంగా మనుషుల మధ్య భౌతిక దూరం పాటించడం ముఖ్యమని గుంపులుగా ఎవరూ చేరకూడదను అంటూ కేంద్ర ఆదేశాలనుసారం విద్యా సంస్థలను కూడా మూసివేసిన విషయం విదితమే.

 Tuition Classes , Coronavirus Lockdown,cops, Punjab Police-TeluguStop.com

దీనితో చాలా పాఠశాలలు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతూ పిల్లల చదువులు దెబ్బతినకుండా చూస్తున్నారు.అయితే కొందరు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను లెక్కచేయకుండా ఇంటిలోనే ట్యూషన్స్ చెబుతూ పిల్లలకు ఇచ్చిన సెలవులను ఉపయోగించుకోకుండా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పంజాబ్ లో కూడా ఒక మహిళ ప్రతిరోజూ విద్యార్థులకు ట్యూషన్ పేరుతొ పాఠాలు చెబుతూ ఉండడం తో పిల్లలు విసిగిపోతున్నారు.సెలవు సమయాల్లో కూడా ఆమె ట్యూషన్స్ చెబుతున్న తీరుతో విసుగుచెందిన ఒక 5 ఏళ్ల విద్యార్థి ఆ టీచర్ ను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించాడు.

ఈ ఘటన పంజాబ్ లోని బతాలా పరిధిలోని తాతాహారి మొహల్లా ప్రాంతంలో ఒక టీచర్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీనితో వెంటనే అక్కడి డీఎస్పీ గురుదీప్ సింగ్ బృందం గాలింపు చేపట్టాడు.

అయితే ఈ విషయం తెలిసి ఆమె వద్దే చదువుకుంటున్న 5 ఏళ్ల బాలుడు ఇంటి అడ్రస్ చెప్పి మరీ రెడ్ హ్యాండేడ్‌గా పట్టించాడు.వెంటనే అక్కడికి వెళ్లి ట్యూషన్ చెబుతున్నారా అంటూ ప్రశ్నించగా,దానికి ఆమె అలాంటిది ఏమీ లేదని బుకాయించింది.

Telugu Cops, Punjab, Classes-

అయితే అప్పటికే ఆమె ఇంటిలో మరో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటున్న విషయాన్ని ఆ బాలుడు పోలీసులకు చూపించడం తో ఆమె ను పోలీసులు మందలించి మరో సారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.లాక్‌డౌన్ సమయంలో కూడా చిన్నారులను ఇలా ట్యూషన్ పేరుతో బయటకు పంపుతున్న తల్లిదండ్రులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube