లాక్‌డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆంక్షలకు మంగళం.. !

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి లాక్‌డౌన్ మే 12నుండి విధించిన విషయం తెలిసిందే.ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ వల్ల విధించిన లాక్‌డౌన్ నుండి ప్రజలు ఆర్ధికంగా కోలుకోక ముందే కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది.

 Telangana Govt, Lockdown Lifted, Covid 19, Kcr-TeluguStop.com

దీనికి తోడు ఆకాశాన్నంటే ధరలు వెరసి సామాన్యుడి ఊపిరి ఆగిపోయేలా కరోనా పరిస్దితులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణలో విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా కేసుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

కాగా ఇప్పటి వరకు అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది.ఇక ఎప్పటిలాగే అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube